Jailor : సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ ఎలా ఉంటుంది తెలియని సినీ లవర్స్ లేరు అనే చెప్పాలి.. ఈయన కోలీవుడ్ సూపర్ స్టార్ అయినప్పటికీ రజినీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.. ముఖ్యంగా తెలుగులో కూడా ఈయనకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.. ఇది వరకు ఈయన సినిమాలు వస్తున్నాయంటే థియేటర్స్ వద్ద క్యూ కట్టేవారు..
అంతేకాదు ఈయన క్రేజ్ ఎలాంటిది అంటే ఈయన సినిమా రోజు ప్రైవేట్ ఆఫీసులకు సైతం సెలవలు ఇస్తుంటారు.. మరి తాజాగా ఈయన నటించిన మూవీ ”జైలర్”.. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసారు.. ఈ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ రజినీకాంత్ కు బాక్సాఫీస్ దగ్గర పూర్వవైభవం వచ్చింది అనే చెప్పాలి.
ఈ సినిమా ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ టాక్ తెచ్చుకుంది.. తమన్నా భాటియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ముందు నుండి భారీ హైప్ క్రియేట్ చేసుకోగా రిలీజ్ తర్వాత కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ దూసుకు పోతుంది.. రజినీకాంత్ వింటేజ్ లుక్, ఆయన స్టైల్, యాక్షన్ అన్ని కూడా ఈ సినిమాను హై లో నిలబెట్టాయి..
ఇక ఇదిలా ఉండగా రజినీకాంత్ జైలర్ సినిమా రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ కు పండగ అనే చెప్పాలి.. అయితే వీక్ డేస్ కావడంతో అందరు మొదటి రోజు సినిమాను చూడలేక పోయారు. కానీ చెన్నై, బెంగూళూరులో ఫ్యాన్స్ బాధపడకూడదని ఏకంగా ప్రైవేట్ కంపెనీలకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ అయ్యింది. మిగిలిన హీరోలు తమ సినిమాలను సెలవుల రోజు రిలీజ్ చేసుకుంటే రజినీకాంత్ సినిమా రిలీజ్ చేసిన రోజు సెలవు అంటూ ఫ్యాన్స్ ఈ ఆనందాన్ని సోషల్ మీడియా వేదిక పంచుకుంటున్నారు.