
జగన్ జైలుకు వెళ్లినప్పటి నుంచి మొదలుకుని.. పట్టుబట్టి మరీ 2019లో సీఎం అయ్యే వరకు సాగిన ఆయన ప్రయాణాన్ని ఇందులో చూపించబోతున్నారు. ఇక తాజాగా మూవీ నుంచి భారీ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాను 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు.
కాగా సినిమాను రాబోయే ఎన్నికలే టార్గెట్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే సమ్మర్ లోనే ఏపీలో ఎలక్షన్లు ఉండబోతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందే సినిమాను రిలీజ్ చేయడం అంటే అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని అంటున్నారు. ఇక ఇందులో జగన్ పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు.
తమిళ హీరో జీవా పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే ఓ బాలీవుడ్ నటుడిని కూడా తీసుకోవాలని భావిస్తున్నారంట. త్వరలోనే దీనిపై క్లారిటీ రాబోతుంది. ప్రస్తుతం నటీనటులను తీసుకునే పనిలో ఉన్నారు డైరెక్టర్. రీసెంట్ గానే ఆయన సైతాన్ వెబ్ సిరీస్ తో వచ్చాడు. ఆ సిరీస్ లో బూతులు, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంది. దాంతో ఇలాటి డైరెక్టర్ జగన్ జీవిత చరిత్రను తీయొద్దనే వాదన కూడా వినిపిస్తోంది. కానీ యాత్ర సినిమాను ఆయన తీసిన విధానం బాగుండటంతో ఆయనకే అవకాశం ఇచ్చారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
ReplyForward
|