Rakhi : ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఆగస్ట్ 19వ తేదీన వస్తుంది. ఈ రాఖీ రోజున ప్రతీ అమ్మాయి.. తన సోదరుడి చేతికి రాఖీ కట్టి మురిసిపోతుంది. ఈ ఏడాది పండగ మాత్రం స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ సోమవారం (ఆగస్ట్ 19) ఆకాశంలో అద్భుతం జరుగుతుందట. బ్లూమూన్ కనిపిస్తుందట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ బ్లూ మూన్ ప్రభావం మూడు రోజులు ఉంటుందట. అంతే కాదు.. చంద్రుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావంతో నాలుగు రాశులవారి జీవితాల్లో అద్భుతం జరగబోతోందట. వారి.. జీవితంలోని చాలా కష్టాలకు ఆ రోజు నుంచి పుల్ స్టాప్ పడనుందట. మరి ఆ రాశులేంటో చూద్దాం.
మేష రాశి..
పౌర్ణమి రోజున వచ్చే బ్లూ మూన్ మేష రాశివారి జీవితంలో సంతోషం తీసుకువస్తుందట. ఈ రాశి వారికి ఆటంకాలు లేకుండా పనులు వేగంగా పూర్తవుతాయట. చేతిలో డబ్బు ఉంటుందట. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయట.
ధనస్సు రాశి..
ధనస్సు రాశి వారి జీవితంలో బ్లూ మూన్ అద్భుతం చేస్తుందట. ధనుస్సు రాశి వారికి పౌర్ణమి తర్వాత మంచి రోజులు వస్తాయట. వ్యాపారాల్లో లాభం వస్తుంట. ప్రతీ పెట్టుబడితో గరిష్ట మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందట. సమాజంలో ప్రతిష్ట కూడా పెరుగుతుందట. ఈ రాశి వారి మాటను అందరూ గౌరవిస్తారట.
మకర రాశి..
మకర రాశి వారి కష్టాలను బ్లూ మూన్ తరిమి కొడుతుందట. మకర రాశికి అదృష్టం తలుపు తడుతుందట. దీర్ఘకాలంగా సమస్య తొలగిపోతుందట. చాలా డబ్బు ఆర్జిస్తారట. కుటుంబంతో ఆనందంగా గడుపుతారట.
కుంభ రాశి..
బ్లూ మూన్ కుంభ రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. కుంభ రాశి వారు వారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగు పడుతుంది. ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి.