News Channels : తెలుగులో అగ్ర చానళ్ల మధ్య పోటీ కొనసాగుతన్నది. టీవీ 9, ఎన్టీవీ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.గురువారం విడుదలయ్యే రేటింగ్స్ లో భాగంగా ఈ పోటీ ఉంది. ఎన్టీవీ తెలుగు 26వ వారం కూడా మొదటిస్థానాన్ని నిలబెట్టుకుంది. గత వారం 80.9తో మొదటిస్థానంలో ఉండగా, ఈ వారం 76.5 శాతంతో ఉంది. ఈటీవీ తెలుగు 58 నుంచి 59.2 శాతానికి పెరిగింది. 32.8 నుంచి 31శాతానికి టీవీ 5 తగ్గింది థర్డ్ ప్లేస్ లో ఉంది. వీ6 నాలుగో స్థానం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 5, టీ న్యూస్ 6, టెన్ టీవీ 7, సాక్షి 8, ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్, ఈ టీవీ తెలంగాణ, హెచ్ఎంటీవీ తరువాతి స్థానాల్లో నిలుస్తూ వచ్చాయి.హైదరాబాద్ పరంగా 99.8 శాతంతో ఎన్టీవీ, 97. 1 శాతంతో టీవీ 9, టీవీ 5, వీ 6, టీ న్యూస్, ఆంధ్ర జ్యోతి, ఈ టీవీ తెలంగాణ, టెన్ టీవీ, హెచ్ఎంటీవీ, సాక్షి, రాజ్ న్యూస్ ఉన్నాయి. అర్భన్ లో చూసుకున్నా, రూరల్ లో చూసుకున్నా ఎన్టీవీ టాప్ లో నిలిచింది. వరుసగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ ఎన్టీవీ ముందుకు సాగుతున్నది. గతంలో టీవీ 9 ఎప్పుడూ ఈ ప్రథమ స్థానంలో కొనసాగేది. కానీ ఇప్పుడు తన ప్లేస్ ను సుస్థిరం చేసుకుంటూ ఎన్టీవీ దూసుకెళ్తున్నది. ఇక రెండు తెలుగు రాష్ర్టాల్లో అధికార పార్టీలకు చెందిన న్యూస్ చానళ్లు వెనుకబడి ఉన్నాయి. తమ పార్టీలకు చెందిన వార్తలకే ప్రాధాన్యమివ్వడం దీనికి కారణంగా కనిపిస్తున్నది.
ReplyForward
|