21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Lokesh padayatra Poddutour : లోకేష్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత

    Date:

    Lokesh padayatra poddutour
    Lokesh padayatra poddutour

    Lokesh padayatra Poddutour : నారా లోకేష్ చేపట్టిన  యువ‌గ‌ళం పాద‌యాత్రలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది.  క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో ఆయనపై కొందరు కోడిగుడ్లు విసిరారు. అయితే ఆ గుడ్లు లోకేష్ సెక్యూరిటీ సిబ్బందికి త‌గిలాయి. దీంతో లోకేష్ సెక్యూరిటీ అప్రమత్తమైంది. ప్రొద్దుటూరు శివాలయం సెంట‌ర్‌లో బ‌హిరంగ స‌భ ముగించుకొని ఆర్టీసి బ‌స్టాండ్ దాటిన త‌రువాత ఓ దుకాణం వద్ద ఆగి స్థానికులతో మాట్లాడుతుండ‌గా కొందరు కోడిగుడ్లు విసిరారు. లోకేష్  యువ‌గ‌ళం పాదయాత్ర  సంద‌ర్భంగా ప్రొద్దుటూరులో సుమారు 500 ల మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. అయినా  లోకేష్ పై కోడిగుడ్లతో దాడి జ‌ర‌గడంపై టీడీపీ వ‌ర్గాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఇది పోలీసుల వైఫ‌ల్యమేనని టీడీపీ అగ్రనేతలు మండిపడుతున్నారు.

    ఈ ఘటనపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టగా వారి నుంచి పోలీసులు అతడిని రక్షించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గురువారం ఉదయం చౌటపల్లి క్యాంప్ సైట్ నుంచి 113వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్… సాయంత్రం 6 గంటలకు ప్రొద్దుటూరుకి చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

    అయితే టీడీపీ అధినేత పాల్గొనే బహిరంగ సభల్లోనూ ఇలాగే దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.  ఇటీవల ఎర్రగొండపాలెంలో టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో రాళ్ల దాడి జరుగగా ఓ కార్యకర్త కు గాయాలయ్యాయి. కొద్దిరోజుల పాటు చికిత్స పొంది చనిపోయాడు. చంద్రబాబు రోడ్ షోలు, సభల్లోనూ వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందకు టీడీపీ కార్యక్రమాల్లో అల్లర్లకు పాల్పడుతున్నది. దీంతో శాంతి భద్రతల సమస్యను బూచిగా చూపించి టీడీపీ కార్యక్రమాలకు అనుమతి లేకుండా చేయాలని అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతున్నదని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Politics : కులం పేరుతో ఏపీలో ఈ అరాచకాలు ఎన్నాళ్లు?

    AP Politics : కుల రహిత సమాజం కోసం గత పాలకులు...

    Jagan Stone Attack : సీఎం జగన్ పై రాయి దాడి కేసు.. నిందితుడికి బెయిల్

    Jagan Stone Attack : ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం జగన్...

    IPL and Jagan : ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ ఓటమికి జగన్ సీఎం పదవికి లింక్ ఉందా?

    IPL and Jagan : గత ఐపీఎల్ టోర్నీలకు మించిన ఎంటర్...

    YCP : వైసీపీ దేనికి సిద్ధం 

    YCP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. జూన్ నాలుగున...