
long covid : ఒమిక్రాన్ వేరియంట్ తరువాత కరోనా మహమ్మారి బారిన పడిన వారిలో ప్రతి పది మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్ బయటపడుతోంది. కోవిడ్ బారిన పడిన వారు ఇప్పటికి కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. లాంగ్ కోవిడ్ తో ఒంట్లో ఉన్న రోగాలు బయట పడుతున్నాయి. దీని వల్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.
తొందరగా అలసిపోవడం, మెదడుపై ప్రభావం, తల తిరగడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె దడ, లైంగిక అనాసక్తి, తరచు దాహం వేడయం, రుచి, వాసన లేకపోవడం, దగ్గు, చాతిలో నొప్పి ఇలాంటి లక్షణాలు ఉన్న వారిలో లాంగ్ కోవిడ్ ఉంటుందని చెబుతున్నారు. ఇలా కోవిడ్ ప్రభావంతో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు.
అమెరికాలో చాలా మందికి టీకాలు వేయించుకున్న తరువాత గుండె జబ్బులు వస్తున్నట్లు చెబుతున్నారు. కోవిడ్ టీకాలు తీసుకున్న వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కరోనా సమయంలో కోవిడ్ బారిన పడిన వారికి చాలా రకాల రోగాలు వస్తున్నాయి. దీంతో కోవిడ్ ప్రభావానికి గురైన తరువాత ఒంట్లో చాలా రకాల రోగాలు వస్తున్నాయి.
మనదేశంలో కూడా టీకాలు వేసుకున్న వారికి ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. అందుకే వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేదంటే అది ముదిరి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. ఇలా కరోనా తరువాత పరిస్థితులు కూడా భయపెడుతున్నాయి. ఇక మీదట కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.