Silver screen : కింది ఫొటోలో కనిపిస్తున్న తల్లీబిడ్డలు ప్రస్తుతం పెద్ద స్టార్స్ గా తెరపై కనిపిస్తున్నారు. ఒకరు వెండితెర.. మరొకరు బుల్లితెరపై నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కొంతకాలం క్రితం బుల్లితెరపై మంజులానాయుడు, బిందు నాయుడు నిర్మించిన చక్రవాకం, మొగలిరేకులు సీరియళ్లు ప్రేక్షకులకు ఎంతో కనెక్ట్ అయ్యాయి. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాయి. ముఖ్యంగా మొగలిరేకులు సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరూ ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
బుల్లితెరలో రాణిస్తూ..
ఇందులో నటించిన శ్రీప్రియా శ్రీకర్ బుల్లితెరపై ఎంతో పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా తల్లి పాత్రల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. మొగలిరేకులు నుంచి ప్రస్తుతం నటిస్తున్న బ్రహ్మముడి వరకు ఆమె ప్రతి సీరియల్ లో తల్లి పాత్రలో ఒదిగిపోతూ వస్తున్నారు. ఆమె ఇప్పటివరకు దాదాపు 30 సీరియళ్లలో నటించారు. ఇక నిజ జీవితంలో శ్రీప్రియా సీరియల్ డైరెక్టర్ శ్రీకర్ ను పెండ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఇందులో ఒక అమ్మాయి ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. సీరియల్స్ లో తల్లి, సినిమాల్లో బిడ్డ ఇప్పుడు బిజీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
తల్లి బాటలో సినిమాల్లోకి..
శ్రీ ప్రియా శ్రీకర్ కూతురు చరిష్మా శ్రీకర్ ప్రస్తుతం సినిమాల్లోకి అడుగు పెట్టారు. రుద్రాంగి, లక్ష్మీ కటాక్షం, ఇటీవల వచ్చిన ప్రేమలో అనే చిత్రాల్లో నటించింది. తల్లి సీరియల్స్ లో బిగ్ యాక్టర్ గా ఉండగా, ఇప్పుడు కూతురు కూడా సినిమాల్లో అలరిస్తున్నది. నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకునేందుకు కష్టపడుతున్నది. చిన్ననాటి నుంచి తల్లిని సీరియల్స్ లో చూస్తూ పెరిగిన చరిష్మా సినిమాలపై ఇష్టాన్ని పెంచుకుంది. ప్రస్తుతం మరికొన్ని సినిమాలకు కూడా ఆమె ఓకె చెప్పినట్లు తెలుస్తున్నది.
View this post on Instagram