
Hair fall problem : ప్రస్తుతం జుట్టు రాలడం సర్వసాధారణంగా మారింది. ఎవరిని చూసినా జుట్టు రాలుతుందనే బాధపడుతున్నారు. దీనికి కారణం మనం తీసుకునే ఆహారమే మనకు శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జుట్టు రాలే సమస్యను అధిగమించడానికి ఏం చేయాలనే దానిపై స్పష్టత రావడం లేదు. ఈ క్రమంలో జుట్టుకు సంబంధించిన సమస్యలను ఎలా నయం చేసుకోవాలో తెలుసుకుందాం.
జుట్టు రాలే సమస్య పరిష్కారం కోసం ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. దీనికి ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత దాన్ని గ్రైండర్ లో వేసుకుని పేస్టుగా చేసుకోవాలి. ఈ ముద్దను ఒక గుడ్డలో వేసి దాని రసాన్ని తీయాలి. దాని రసం తలకు పట్టించి మర్దన చేసుకోవాలి. ఆ తరువాత కొన్ని నిమిషాల పాటు చేతులతో మసాజ్ చేసుకోండి.
అరగంట తరువాత షాంపూతో కడగండి. ఇందులో సల్ఫర్ ఉంటుంది. జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం ద్వారా హెయిర్ ఫోలికల్స్ ఉత్తేజితంగా మారతాయి. జుట్టు వేగంగా పెరిగేందుకు కారణమవుతుంది.
ఉల్లిపాయ రసంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల చుండ్రు సమస్య పోతుంది. జుట్టును బలంగా చేయడంలో దోహదపడుతుంది. ఇందులో ఉండే ఖనిజం, సల్ఫర్ వెంట్రుకలను బలోపేతం చేస్తుంది. ఇలా మనకు జుట్టు సమస్యకు ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది.