Onion price Hike :
ప్రస్తుతం దేశంలో టమాటా, పచ్చిమిర్చి, ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నాలుగురోజుల క్రితం వరకు కిలో రరూ. 15 పలికిన ఉల్లిధర ప్రస్తుతం రూ. 30 నుంచి 35 పలుకుతున్నది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 20 దాటింది. అయితే ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. టమాటా ప్రస్తుతం కిలో రూ. 120 నుంచి రూ.150 దాకా పలుకుతున్నది. ఈ సమయంలో ఉల్లి ధరలు కూడా పెరిగే దిశగా వెళ్తున్నాయి. ఇది సామాన్య ప్రజానీకానికి కొంత ఇబ్బందికర పరిస్థితే అని చెప్పవచ్చు. హోల్ సేల్ మార్కెట్లో ప్రస్తుతం ఉల్లిధర 25 శాతం పెరిగింది.
చాలా మార్కెట్లలో ఉల్లి ధర శుక్రవారం క్వింటాలుకు రూ. 1300 దాటింది. రాజస్థాన్, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్లలో ఈ ఏడాది ఉల్లి బాగా పండింది. ఫిబ్రవరిలో విపరీతంగా ధరలు పడిపోయాయి. దీంతో రైతు రూపాయి. రెండు రూపాలకు అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో కొందరు రోడ్డుపై పడేసి వెళ్లారు. ఇప్పుడు ఉల్లిధర అమాంతం పెరుగుతున్నది. ఉల్లి డిమాండ్కు అనుగుణ:గా సరఫరా లేకపోవడంతో పాటు అకాల వర్షాలతో పంట నష్టం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తున్నది. అయితే ఉల్లి ధరలతో పాటు టమాటా, మిర్చి ధరల పెరుగుదలను నియంత్రించాలని ప్రభుత్వాలను ప్రజలు కోరుతున్నారు.
రానున్న రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశమున్నది. కిలో వంద దాటినా ఆశ్చర్య పోనవసరం లేదు. కేంద్ర ప్రభుత్వంతో పాటు మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఈ నెలాఖరుకు ఉల్లి ధరం రెట్టింపు అయ్యే చాన్స్ ఉందని అంతా భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటినుంచే ఉల్లి కొనుక్కునేందుకు అంతా సిద్ధమవుతున్నారు. అయితే సరిపడా నిల్వలు మార్కెట్లో లేకపోతే వ్యాపారులు రేటు పెంచి అమ్మే చాన్స్ ఉంటుంది. ఉల్లి, టమాటా, పచ్చిమిర్చి కొనాలంటే ఇక సామాన్యుడికి కన్నీరు తప్పేలా లేదు. ప్రభుత్వాలే కొంత సబ్సిడీ రూపంలో రైతు బజార్ల ద్వారా విక్రయిస్తే సామాన్యుడికి మేలు చేసినట్లవుతుంది. లేదంలే ఆయా కుటుంబాలకు ఇక్కట్లు తప్పవు.