OTT Sequel : కనికా ధిల్లాన్ రచన, జయప్రద దేశాయ్ దర్శకత్వం వహించిన ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ 2021 నోయిర్ థ్రిల్లర్ ‘హసీన్ దిల్రుబా’కు సీక్వెల్. ఇది ఆ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఇండియా ఒరిజినల్స్ లో అత్యధికంగా వీక్షించిన దానిలో ఒకటి.
నీల్ హత్య తర్వాత కేసు నుంచి తప్పించుకునేందుకు కొత్తగా అస్తిత్వాలను మర్చుకొని రాణి, రిషబ్ వేర్వేరు జీవితాలను గడుపుతుండడంతో సీక్వెల్ స్ట్రాట్ అవుతుంది. దేశం విడిచి వెళ్లి ఆనందంగా ఉండాలని అనుకుంటారు. పోలీస్ అధికారి నీల్ మామ మోంటు నీల్ మరణంపై దర్యాప్తును తిరిగి ప్రారంభించడంతో వారికి మళ్లీ ఇబ్బందులు మొదలవుతాయి. ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’లో అబద్ధాలు, మోసం, ఊహించని మలుపులు తీసుకుంటుంది.
మొదటి సినిమా మాదిరిగానే సీక్వెల్ కూడా గత, వర్తమాన మధ్య కొనసాగుతుంది. ఇంటర్మిషన్ ఆశ్చర్యకరమైన ట్విస్ట్ ఇస్తుంది. దురదృష్టవశాత్తు, దాని గత చిత్రం మాదిరిగానే, సెకండాఫ్ ట్విస్ట్ ఇస్తుంది. స్క్రీన్ ప్లే మెల్లగా మొదలై అనేక మలుపులు తీసుకుంటుంది. పాత్రల మధ్య సంబంధాలు కూడా నమ్మశక్యం కానివిగా ఉంటాయి.
పాజిటివ్ గా చూస్తే ప్రత్యేకంగా అనిపిస్తుంది. తాప్సీ మరోసారి తెరపై మెరిసి అదరగొడుతుంది. విక్రాంత్ మాస్సే ఈ గందరగోళాన్ని సమర్ధవంతంగా జోడించగా, సన్నీ కౌశల్ మంచి నటన కనబరిచాడు. ఓవరాల్ గా ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ అంచనాలకు మించి ఆడుతోంది. మొదటి భాగానికి మిశ్రమ స్పందన లభించింది. ఇప్పటికైతే నెట్ ఫ్లిక్స్ లో చాలా పాజిటివ్ రివ్యూలతో సాగుతోంది. రొమాన్స్, ట్విస్ట్, ఎంగేజ్ గా ఉండడంతో వ్యూవర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనికి తోడు నెట్ ఫ్లిక్స్ ఇండియా సీక్వెల్ కావడతో వ్యూవర్ షిప్ పెరుగుతోంది.