Stars of yesteryear ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ పొజిషన్ లో ఉంది అంటే అందుకు కారణం మన అలనాటి తారలు అనే చెప్పాలి.. వీరు అప్పట్లో ఇండస్ట్రీకి చేసిన సేవల కారణంగానే మన టాలీవుడ్ ఇండియాలోనే నెంబర్ వన్ గా రాణిస్తుంది.. ఇప్పటి వరకు మన తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు వెండితెరపై కనిపించి అలరించారు.
గతంలో మన తారలు వెండితెరపై కనిపించి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టు కోవడమే కాకుండా వారికంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఒకప్పటి అలనాటి తారల్లో చెప్పుకోదగిన వారు ఎందరో ఉన్నారు.. వీరంతా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో కృషి చేసారు.. వారు చేసిన కృషి కారణంగా ఈ రోజు మన స్థాయి పెరిగింది.
మరి అలనాటి తారల చిత్రాలు ఒకే వేదికపై చూడడం కష్టమే.. కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అప్పటి తారల అరుదైన ఫోటోలు ఎక్కడో ఒకచోట మనకు కనిపిస్తూనే ఉన్నాయి.. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో అప్పటి తారల చిత్రాలు కనిపిస్తున్నాయి.
ఈ వీడియోలో అరుదైన ఫోటోలు చాలానే ఉన్నాయి.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, రేలంగి దంపతులు, మోహన్ బాబు వంటి వారు వారి కుటుంబాలతో కలిసి కనిపించిన అరుదైన దృశ్యాలు ఒకే వీడియోలో చూడవచ్చు.. అలనాటి హీరోయిన్స్ కూడా చాలా మంది కనిపిస్తున్నారు.. మరి అలాంటి అరుదైన వీడియో మీరు చూసేయండి..