కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. పద్మశ్రీ , పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ లకు పలువురు ప్రముఖులను ఎంపిక చేసింది. వివిధ రంగాలలో విశేష కృషి చేసి , ప్రజలకు విశిష్ట సేవలు అందించిన సేవాతత్పరులకు కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. 91 మందికి పద్మశ్రీ అవార్డు ప్రకటించగా పద్మభూషణ్ , పద్మ విభూషణ్ లతో కలిపి మొత్తం 106 మందికి పద్మ పురస్కారాలను అందిజేసింది.
అయితేకేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలతో తెలుగు తేజాలు కూడా ఉన్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ శ్రీ శ్రీ చిన జీయర్ స్వామికి పద్మభూషణ్ ప్రకటించింది కేంద్రం. రామచంద్ర మిషన్ ద్వారా సేవలు అందిస్తున్న ఆధ్యాత్మిక గురువు శ్రీ కమలేష్ డి. పటేల్ ను కూడా పద్మభూషణ్ తో సత్కరించనుంది కేంద్రం. ప్రముఖ గాయని వాణీ జయరాం ను కూడా పద్మభూషణ్ తో సత్కరించనుంది కేంద్రం.
ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి , సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్న డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ , గిరిజన భాషపై అధ్యయనం చేసిన బి. రామకృష్ణారెడ్డి, సివి రాజు , అబ్బారెడ్డి నాగేశ్వర్ రావు , ఎం. విజయ గుప్తా , డాక్టర్ పసుపులేటి హనుమంతరావు , కోట సచ్చిదానంద మూర్తి తదితరులకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.