
Nara Lokesh : టీడీపీ యువనేత నారా లోకేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నాడు. 40 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న తండ్రి చతురతకు సరిపోయేలా తనను తాను నిరూపించుకోవాలని ఉబలాటపడుతున్నాడు. సమయమున్నప్పుడల్లా అధికార వైసీపీ పై విమర్శనస్ర్తాలు ఎక్కుపెడుతూ పార్టీలో ని యువ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడంలో భాగంగా 400 రోజుల పాదయాత్రకు లోకేశ్ శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే 100 రోజుల పాదయాత్ర ముగిసింది. అన్ని ప్రాంతాల్లో ఈ పాదయాత్రకు మిశ్రమ స్పందన వస్తున్నది..
వేధిస్తున్న భుజం నొప్పి..
అయితే యువగళం పాదయాత్రలో ఉన్న నారాలోకేశ్ కుడి భుజం నొప్పితో బాధపడుతున్నాడు. అక్కడి మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్లో నారా లోకేశ్ కుడి భుజానికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నాడు. 50 రోజులుగా ఈ నొప్పితో బాధపడుతున్నట్లుగా సమాచారం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి నియోజవకర్గంలో పాదయాత్ర చేస్తుండగా కార్యకర్తలో తోపులాటలో కుడి భుజానికి గాయమైనట్లుగా భావిస్తున్నారు. అప్పటి నుంచీ నొప్పి ని భరిస్తూనే లోకేశ్ పాదయాత్ర ను కొనసాగిస్తున్నారు.
తన ఫిజియోథెరపీ వైద్యుల సూచనలు పాటిస్తున్నా నొప్పి తగ్గడం లేదని తెలిసింది. దీంతో వైద్యుల సూచన మేరకు నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న మ్యాగ్న ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ లో లోకేశ్ కుడి భుజానికి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా దవాఖాన ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు శ్రేణులు చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు దవాఖాన పరిసరాల్లో ఏర్పాటు చేయించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం యువనేత లోకేశ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.