39.4 C
India
Saturday, June 6, 2026
More

    Pakistan VS America : పాకిస్థాన్ కు షాక్.. అమెరికా దెబ్బకు సూపర్ ఓవర్ లో ఓటమి

    Date:

    Pakistan VS America
    Pakistan VS America

    Pakistan VS America : క్రికెట్ లో పసికూన అయిన యూఎస్ఏ (అమెరికా) టీం పాకిస్థాన్ పై సూపర్ ఓవర్ లో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి షాక్ ఇచ్చింది. అమెరికా, పాకిస్థాన్ మధ్య గ్రాండ్ ఫ్యారీ స్టేడియం డల్లాస్ లో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై విజయం సాధించి గ్రూప్ 1 లో ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే కెనడాపై గెలిచిన యూఎస్ఏ అంతర్జాతీయ క్రికెట్ లో టాప్ టీం అయిన పాకిస్థాన్ పై గెలిచి సంచలనం క్రియేట్ చేసింది.

    అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. 9 పరుగుల వద్దే మహమ్మద్ రిజ్వాన్ ను అవుట్ చేయగా..  26 పరుగులకే మూడు వికెట్లు తీసి పవర్ ప్లే లో  పాక్ బ్యాటర్లు రన్స్ చేయకుండా యూఎస్ఏ  కట్టడి చేశారు. యూఎస్ఏ బౌలర్లు కెంజీగి, నేత్రవల్కర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అయిదు వికెట్లు తీశారు. పాకిస్థాన్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం 44 పరుగులు చేయగా.. షాదాబ్ ఖాన్ 25 బంతుల్లోనే మూడు సిక్సులు, ఒక ఫోర్ తో 43 పరుగులు చేశాడు. చివర్లో బౌలర్ షాహీన్ ఆఫ్రిది బ్యాటింగ్ రెండు సిక్సులు, ఒక ఫోర్ తో 23 పరుగుల చేయడంతో పాక్ 159 పరుగులు చేసి మొదటి ఇన్సింగ్స్ ముగించింది.

    160 పరుగుల ఛేజింగ్ తో దిగిన  అమెరికాకు టేలర్, కెప్టెన్ మోనాంక్ పటేల్ మంచి ఆరంభమిచ్చారు. 5 ఓవర్లలో 36 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. టేలర్ 12 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన అండ్రూ గౌస్, మోనాంక్ పటేల్ కలిసి సింగిల్స్, డబుల్స్ తీస్తూ పాక్ బౌలర్లకు చిక్కకుండా నెమ్మదిగా పార్ట్ నర్షిప్ బిల్డప్ చేశారు.

    అండ్రూ గౌస్ 35, మోనాంక్ పటేల్ 50 పరుగులు, అరోన్ జోన్స్ 36 నితీశ్ కుమార్ 14 పరుగులతో సమయోచితంగా ఆడటంతో యూఎస్ఏ 20 వ ఓవర్ చివరి బంతికి మ్యాచ్ ను టైగా ముగించగా.. చివరకు సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసి 18 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లు అమెరికా బౌలర్ నేత్రవల్కర్ బౌలింగ్ లో  19 పరుగులు చేయలేక ఓటమి మూటగట్టుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rohit Sharma : రోహిత్ శర్మ ఆ పని చేయకుంటే.. ఇండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచేదే కాదు

    Rohit Sharma : రోహిత్ శర్మ సారథ్యంలో 2024 టీ 20...

    India Vs Zimbabwe : కుర్రాళ్లకు పరీక్ష.. జింబాబ్వేతో ఆడే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

    India Vs Zimbabwe : టీ-20 ప్రపంచ కప్ 2024 కిరీటాన్ని...

    Indian Cricketers – PM Modi : ప్రధాని మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ!

    Indian Cricketers - PM Modi : వెస్టిండీస్-అమెరికా సంయుక్త రాష్ట్రాలు...

    World Champions : విజయ యాత్రకు సిద్ధమైన వరల్డ్ చాంఫియన్లు

    World Champions : టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత క్రికెట్...