Pakistan Drones : భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 300 నుంచి 400 డ్రోన్లతో పాక్ ఈ దాడులకు పాల్పడినట్లు భారత సైన్యం తెలిపింది. పాకిస్థాన్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తోందని వెల్లడించింది.