
Pallavi Prashanth Parents : బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవ్వడమే కాకుండా అప్పుడే ఫస్ట్ వీక్ అయిపోయింది. మొదటి వారమే ఎన్నో ట్విస్టులతో అలరించిన బిగ్ బాస్ చివరికి కిరణ్ రాథోడ్ ను ఎలిమినేట్ చేసాడు. ఇక ఇప్పుడు రెండవ వారం మరింత ఆసక్తిగా మారింది.. గత రెండు సీజన్స్ లలో బిగ్ బాస్ అలరించలేక పోవడంతో ఈసారి మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి రంగంలోకి దిగాడు.
ఈసారి వచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ లో రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఒకరు. మరి ఇతడు హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుండి కంటెస్టెంట్స్ తేలికగా చూస్తున్నారు.. కానీ సాధారణ ఆడియెన్స్ లో మాత్రం ఇతడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.. ఈయనకు ముందు నుండి మంచి ఓటింగ్ వస్తూ టాప్ లో ఉంటున్నాడు.
ఇక ప్రశాంత్ పేరెంట్స్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొందరు కంటెస్టెంట్స్ పై కీలక ఆరోపణలు చేసారు.. మా అబ్బాయి బిగ్ బాస్ కు వెళ్లినందుకు చాలా ఆనందంగా ఉంది.. మా అబ్బాయి సాంగ్ చేస్తే 7 లక్షలు వస్తే ఫ్రెండ్స్ మోసం చేసారు. దీంతో చనిపోతాను అన్నాడు. కానీ దేనికైనా నేను అండగా ఉంటానని చెప్పాను..
ఫోన్ కావాలని అడిగితే ఫోన్ కొనిపెట్టాను.. రీల్స్ చేసి బాగా ఫేమస్ అయ్యాడు.. ఏదో ఒకటి చేయాలని తిండి తినకుండా కష్టపడ్డాడు.. బిగ్ బాస్ లోకి వెళ్లడంతో సంతోషంగా ఉంది.. కానీ అమర్ దీప్ ఏందిరా? అనడం నచ్చలేదు.. ఎవరికీ ఉండేది వారికీ ఉంటుంది.. రైతు బిడ్డ అని చీప్ గా చూస్తున్నారు.. బిగ్ బాస్ హౌస్ లో అందరు సమానమే..
ఇక రతికా రాజ్ మా వాడిని ఓట్ల కోసం వాడుకుంది. వాడితే ఉంటే ఓట్లు పడతాయని భావించింది. అతడికి దురాలోచనలు లేవు.. అందరిని అక్క, చెల్లి అంటుటాడు.. హౌస్ నుండి బయటకు రాగానే పెళ్లి చేస్తాం.. ఇంతకు ముందే చేస్తాం అంటే నేను ఏదొకటి చేసే వరకు పెళ్లి చేసుకోను పెళ్లి మాట చెబితే ఇంటికి కూడా రాను అని తెలిపాడు.