Partha Sarathi : మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి తెలుగుదేశం పార్టీలో చేరిక ఖాయ మైనట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. టీడీపీ తరపున నూజివీడు నుంచి పోటీకి చేయా లని పార్థసారథి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలు స్తోంది. దీనికి అధినాయకుడు పసుపు జెండా ఊపినట్లు తెలుస్తోంది. వైసీపీలో సిట్టింగ్ లను మారుస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.
ఈ నేపద్యంలోని మాజీ మంత్రి పార్థసారధికి కూడా ఈసారి టికెట్ కష్టమని సంకేతాలు వెలవడంతో మనస్థాపాన్ని గురైన పార్థసారథి ఇక పార్టీలో కొనసాగలేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. టికెట్ ఇవ్వకపోయినా ఈ పార్టీలో కొనసాగే అవసరం తనకు లేదని రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీలోకి వెళ్లి మా సత్తా ఏంటో చూపిస్తాను పార్థసారథి ఉన్నట్లు తెలుస్తోంది.