
Hindu Sankharavam Sabha : హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా హైందవ శంఖారావం సభలు నిర్వహిస్తున్నారు. విజయవాడకు సమీపంలో కేసరపల్లిలో హైందవ శంఖారావం నినాదంతో వీహెచ్.పీ హిందూ సంఘాలు, బీజేపీ నేత ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 30 ఎకరాలలో ఈ సభ, పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. బస్సులు, రైళ్ళల్లో లక్షల మంది ఈ సభకు తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి శంఖారావాన్ని పూరించి సభలకు అంకురార్పణ చేస్తున్నామని సభ నిర్వాహకులు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం, బిట్రా శివన్నారాయణలు పిలుపునిచ్చారు. తాజాగా వీరు ముగ్గురు సభ ఏర్పాట్లను కేసరపల్లిలో పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ జనవరి 5 మధ్యాహ్నం ఈ సభ ప్రారంభమై సాయంత్రం వరకు జరుగుతుందన్నారు. హిందూ ఆలయాలు ప్రభుత్వాల చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. భక్తులే స్వయం ప్రతిపత్తితో నిర్వహించాలనే డిమాండ్‌తో ఈ హైందవ శంఖారావ సభలు నిర్వహిస్తున్నామన్నారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
-పాతూరితో కలిసి పరిశీలించిన పురంధేశ్వరి
గన్నవరం సమీపంలో ని కేశరపల్లి వద్ద విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే హైందవ శంఖారావం సభ ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు. ఆమె వెంట బీజేపీ నేత పాతూరి నాగభూషణం ఉన్నారు. పురంధేశ్వరి గారి ని విహెచ్ పి నేతలు ఆహ్వానించారు.
ఈసందర్భంగా సభకు హాజరయ్యేందుకు వచ్చే వారికి. చేస్తున్న ఏర్పాట్లు ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విహెచ్ పి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ గారు స్వయంగా పురంధేశ్వరి గారికి వివరాలు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి రైళ్లు లో వచ్చేవారు ఏవిధంగా వస్తు న్నారు వారి ఏర్పాటు ఏవిధంగా చేశారు అనే విషయాలను రవి కుమార్ వివరించారు .
పురంధేశ్వరి వెంట బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ,నూతల పాటి బాల తదితరులు పాల్గొన్నారు.