Pashupati Remuneration : కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క లేడీ ఓరియంటెడ్ క్యారెక్ట్ లో చేసిన సినిమా ‘అరుంధతి’. ఈ సినిమా ‘మల్లెమాల’ బ్యానర్ పై శ్యామ్ ప్రసాద్ 2009లో నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. సినిమా పట్ల చక్కటి అభిరుచి కలిగిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి తన కెరీర్ లో మర్చిపోలేని సినిమా ఇది. రొటీన్ సినిమాలకు భిన్నంగా దీన్ని తెరకెక్కించాడు దర్శకుడు.
ఈ సినిమాలో అరుంధతి పాత్ర కోసం చాలా సెర్చ్ చేసింది చిత్ర యూనిట్. కథ పరంగా నటి రాణిగా రాయల్ లుక్ లో కనిపించాలని ఎక్కడా రాజీపడకుండా వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో జెమినీ కిరణ్ సూపర్ సినిమాలోని అనుష్క ఈ పాత్రకు కరెక్టర్ గా సూట్ అవుతుందని శ్యామ్ ప్రసాద్ కు వివరించారు. అయినా కూడా ఆమెతో కూడా ఆడిషన్స్ నిర్వహించి ఫైనల్ చేశారు నిర్మాత, దర్శకుడు.
ఈ సినిమాలో అనుష్కతో పాటు అంతే నిడివి ఉన్న రోల్ లో నటించాడు సోనూసూద్. పశుపతిగా ఆయన క్యారెక్టర్ ప్రతి ఒక్కిరినీ ఆకట్టుకుంది. నెగెటివ్ రోల్ ను ఆయన బాగా పండించారు. కానీ ఈయన కంటే ముందు ఈ క్యారెక్టర్ తమిళ్ స్టార్ పశుపతిని ఇవ్వాలని అనుకున్నారట చిత్ర యూనిట్. అందుకే పేరు కూడా మార్చకుండా పశుపతిగా పెట్టారు. ఈ పాత్రకు తగ్గట్టుగానే ఆయన అఘోరాగా బాగా కనిపిస్తారని భావించింది చిత్ర యూనిట్. అయితే అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అశోక్ రిలీజ్ అయ్యింది. అందులో ప్రతి నాయకుడి పాత్ర పోషించింది సోనూసూద్. శ్యామ్ ప్రసాద్ దృష్టి ఆయనపై పడింది. సోనూసూద్ ను తీసుకుంటే బాగుంటుందని భావించాడు ఆయన. ఈ విషయం చెప్పాడు తను అఘోరా పాత్ర చెయ్యనని చెప్పాడు. ఒక్కసారి మేకప్ టెస్ట్ చేసిన తర్వాత కూడా నచ్చకపోతే వద్దని శ్యామ్ ప్రసాద్ చెప్పారు. దీంతో ఆయన అయిష్టంగానే ఒకే చెప్పాడు.
దశావతారం మేకప్ ఆర్టిస్ట్ రమేశ్ ను పిలిపించి సోనూసూద్ కు మేకప్ వేయించారు. దీని కోసం రమేశ్ దాదాపు 6 గంటల సమయం తీసుకున్నాడు. మేకప్ వేసిన తర్వాత కూడా సోనూసూద్ కు ఆ పాత్ర వేయడం ఇష్టం లేదు. అయినా ప్రొడ్యూసర్ తపనతో ఆయన ఒకే చెప్పాల్సి వచ్చింది. తన పాత్ర షూటింగ్ 20 రోజుల్లో పూర్తి చేస్తామని శ్యామ్ ప్రసాద్ హామీ ఇచ్చారు. దీనికి రూ. 18 లక్షల పారితోషికం ఇస్తానని శ్యామ్ ప్రసాద్ చెప్పారు. 20 రోజుల్లో పూర్తి కాకుండా ఒక్కో రోజుకు రూ. 25వేల చొప్పున చెల్లిస్తానని ఆయన చెప్పారట. అలా ఆయన పాత్ర షూటింగ్ 20 రోజుల్లో పూర్తి కాలేదు. చిత్రం మొత్తం పూర్తయ్యే సరికి ఆయనకు రూ. 45 లక్షల పారితోషికం అందజేశారట.