36.5 C
India
Friday, April 10, 2026
More

    ఏపీకి పవన్ కళ్యాణ్.. కలవరపడుతున్న వైసీపీ నేతలు..

    Date:

    Pavan Kalyan
    Pavan Kalyan

    Pavan Kalyan to AP : జనసేన పార్టీ అధినేత చాలా రోజుల తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోతున్నాడు. మార్చిలో జనసేన ఆవిర్భావ సభ ఉండడంతో.. కృష్ణా జిల్లా, మచిలీపట్నంలోని ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన పార్టీ కార్యకర్తలు, జన సంద్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ఆయన. ఇక ఆ తర్వాత ఆయన ఏపీకి రాలేదు.

    గోదావరి ఉమ్మడి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం పర్యటించనున్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు. రైతులను ఆదుకోవడంలో వైఎస్ఆర్‌సీపీ పూర్తిగా విఫలమైందని, సీఎంకు అన్నదాల కష్టాలు కనిపించడం లేదని ఆరోపించారు. పంట నష్టం తెలుసుకునేందుకు, ప్రభుత్వంతో కొట్లాడేందుకు ఆయన నేరుగా రైతులను కలుసుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి విమానాశ్రయానికి వస్తారు. రోడ్డు మార్గంలో కడియంకు  వెళ్తారు. పంట నష్టపోయిన బాధిత రైతులను పవన్ పరామర్శించనున్నారు. తర్వాత కొత్తపేట మండలం, ఆవిడి గ్రామలో రైతులతో ముఖాముఖి సమావేశమవుతారు. వారి కష్టాన్ని తెలుసుకుంటారు.

    కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటన ఇప్పటికే ఖరారైంది. ఆయా నియోజకవర్గాల మీదుగా కొనసాగుతుంది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి గోదావరి జిల్లాల నాయకులు ఆయన వెంట ఉంటారు. గతంలో ఇదే ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే భారీ ఎత్తున కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు పవన్ కళ్యాణ్. సూసైడ్ చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని యాత్రను చేపట్టింది. సూసైడ్ చేసుకున్న రైతులకు సంబంధించి 40 కుటుంబాలకు ఆయన రూ. లక్ష చొప్పున చెక్కులను అందించారు.

    మరోసారి ఆయన రైతు సమస్యలపైనే పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటించారు. పంట నష్టంపై విచారం వ్యక్తం చేశారు. జనసేన కూడా ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని ఎంచుకుంది. అందుకే పార్టీ అధినేత సుధీర్ఘ విరామం తర్వాత రానున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...