
Pawan Ali combination Repeat : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ జోడిగా నటిస్తున్న సినిమా ఓజీ. దీనికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా మంచి హిట్ కొట్టాలని అటు పవన్ కల్యాణ్, ఇటు సుజిత్ ఆరాటపడుతున్నారు. ఈ సినిమా రోజుకో విధంగా వైరల్ గా మారుతోంది. ఈ సినిమాలో పవన్ లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ అలీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొద్ది కాలంగా వీరి మధ్య స్నేహ సంబంధాలు లేకుండా పోయాయి. అత్తారింటికి దారేది సినిమా తరువాత వీరిద్దరు కలిసి నటించలేదు. వకీల్ సాబ్ లో అలీకి చిన్న పాత్ర కూడా లేదు. దీనికి కారణం ఉంది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లో తిరుగుతుంటే అలీ వైసీపీలో కొనసాగుతున్నారు.
దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే అలీ కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ తో నటించడం లేదని టాక్. కానీ ఓజీ సినిమాలో అలీ నటిస్తున్నాడని చెబుతున్నారు. ఇది కేవలం పుకారే. దీనిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో అలీని తీసుకోవాలనే పాత్రలో మరో కమెడియన్ ను తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుజిత్ ను నమ్మి ఈ సినిమా అవకాశం ఇవ్వడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సుజిత్ సాహో సినిమాను ప్లాప్ చేయడంతో ఇక ఈ సినిమాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కెరీర్ ను మలుపు తిప్పుతాడో లేక హిట్ గా నిలుపుతాడో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఓజీ సినిమా ఏం వండర్ క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే.






