
Pawan chance for comedian Prithvi that’s power star : పృథ్వీ.. ఈ పేరు కంటే కూడా 30 ఇయర్స్ పృథ్వీ అంటే అందరు వెంటనే గుర్తు పడతారు.. తెలుగు సినిమాల్లో కమెడియన్ గా కనిపించి అందరిని కడుపుబ్బా తన కామెడీ టైమింగ్ తో నవ్వించిన పృథ్వీ అంటే అందరికి చాలా ఇష్టం.. అయితే ఈయన 2019 ఎన్నికల ఈయన వైసీపీ పార్టీలో చేరారు..
దీంతో వైసీపీ పార్టీలో పెద్ద హంగామా చేశారనే చెప్పాలి.. ప్రచారం సమయంలో రాష్ట్రము మొత్తం తిరిగారు.. దీంతో ఈయన హంగామా చూసి సీఎం జగన్ ఎస్వీబీసీ ఛైర్మెన్ పదవి ఇచ్చారు.. అయితే ఈయన మహిళతో జరిపిన ఫోన్ సంభాషణ కారణంగా వివాదంలో చిక్కుకుని పదవిని పోగొట్టుకున్నారు..
ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పృథ్వీ జనసేన పార్టీలో చేరారు.. మెగా బ్రదర్ నాగబాబు అండతోనే ఈయన జనసేన పార్టీలో చేరినట్టు తెలుస్తుంది. ఈ మధ్య పృథ్వీ పవన్ గురించి.. జనసేన పార్టీ గురించి కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం విధితమే.. ఇక మొన్నటి వరకు సినిమాల్లో కమెడియన్ గా కనిపించి నవ్వించిన పృథ్వీ తాజాగా డైరెక్టర్ అవతారం ఎత్తారు..
ఈయన ప్రస్తుతం ”కొత్త రంగుల ప్రపంచం” అనే టైటిల్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ షూటింగ్ లో బిజీ బిజీగా గడుపు తున్నాడు.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈయన చేసే వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. చాలా రోజుల తర్వాత పవన్ సినిమాలో నటించడం జరిగింది అని అంతకు ముందు చాలా సినిమాల్లో నటించిన లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న రీమేక్ సినిమాలో ఈయన నటించారు..
అంతకు ముందు ఆయనను తిట్టారు కదా పవన్ ఏమైనా అన్నారా అని అడుగగా.. అలాంటిది ఏమీ లేదు.. ఆయన ఒక యోగి.. ఇలాంటి విషయాలు పట్టించుకోరు.. ప్రపంచాన్ని చదివిన పవన్ కళ్యాణ్ సెట్స్ లో సామాన్యుడిలాగేనే ఉంటారు.. అంటూ ఈయనను ప్రశంసలతో ముంచెత్తారు..