Pawan fans Vs Mudragada : జనసేనాని పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర కొనసాగుతున్నది. ఈ యాత్రకు పవన్ అభిమానులు, జనసైనికులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే కాపు సామాజిక వర్గం ఓట్లే లక్ష్యంగా వపన్ ఈ యాత్ర చేపట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పవన్ సక్సెస్ అ య్యారని అంతా భావిస్తున్నారు. ఈ సారి అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ పవన్ యాత్ర కొనసాగుతున్నది. వచ్చే ఎన్నికల్లో జగన్ ను గద్దె దించాలని పవన్ ప్రసంగం కొనసాగుతున్నది.
రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడంతో పాటు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం, నాయకులు చేస్తున్న దాడిని పవన్ తన ప్రసంగంలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ సారి వైసీపీ గద్దె దిగకపోతే ఇక రాష్ర్టం దివాళా కు చేరుకోవడం ఖాయమని, కాపుల ఐక్యతను చాటుదామని పిలుపునిస్తారు. అయితే ఈ సారి పవన్ తన ప్రసంగంలో ఉప్మా విషయం లేవనెత్తడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తన ప్రసంగంలో భాగంగా పవన్ మాట్లాడుతూ కొందరు కార్యకర్తలకు మాటలకు అనుగుణంగా క్యాంటీన్లో టిఫిన్ గురించి చర్చ తీశారు. కొందరు వడ, కొందరు ఇడ్లీ, కొందరు పూరి, కొందరు ఉప్మా కావాలంటున్నారని, అయితే ఎక్కువ ఉప్మానే కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. దీనిపైనే ఇప్పుడు సెటైర్లు పేలుతున్నాయి. పవన్ ఇప్పటికే టీడీపీతో కలిసి జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఆయన వైసీపీ కి టార్గెట్ అయ్యారు. అయితే పవన్ ఉప్మా ప్రసంగంపై జన సైనికులు మాత్రం విపరీత ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ఉప్మా కథ ఇప్పుడు అటు తిరిగి.. ఇటు తిరిగి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైపు మళ్లింది.
టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని లేవతీశారు. వైసీపీ అధినేత జగన్ కు అనుకూలంగా ఆయన ఈ ఉద్యమాన్ని నడిపించారని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. అయితే ఇటీవల పవన్ కాకినాడ ఎమ్మెల్యేను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానిని ఖండిస్తూ ముద్రగడ కాపు ఉద్యమానికి ద్వారంపూడి ఎంతో చేశారని చెప్పుకొచ్చారు. ఈ మాటే ఇప్పుడు జనసైనికులు, పవన్ అభిమానుల ఫైర్ కు కారణమైంది. నాటి ఉద్యమ సమయంలో ముద్రగడ కేవలం ఉప్మానే పెట్టించారని, అయితే ఈ డబ్బులు ద్వారంపూడినే ఇచ్చారా అంటూ మండిపడుతున్నారు.
ఆ ఉప్మా బిల్లు అంటూ మనిషికి రూ. 50, రూ. 100 మనీయార్డర్ చేస్తున్నామని చెబుతున్నారు. అయితే ముద్రగడ టార్గెట్ గానే పవన్ ఉప్మా వ్యాఖ్యలు చేశారని అంతా అనుకుంటున్నారు. దీనికి తోడు జనసైనికుల ట్రోల్స్ కూడా కొనసాగుతున్నాయి. ఏదేమైనా గతంలో కాపులను ముద్రగడ ఎంతో ఓన్ చేసుకున్నారు. కాపు ఉద్యమనేతగా ఆయన మంచి గుర్తింపు వచ్చింది. ఈయనతో పాటు హరిరామ జోగయ్య కూడా కాపుల్లో మంచి పేరున్న నేత. అయితే ఇప్పుడంతా పవన్ వైపే చూస్తున్నారు. ముద్రగడ తమను మోసం చేస్తున్నాడని కాపు సామాజిక వర్గం లో మెజార్టీ అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరోవైపు హరిరామజోగయ్య కూడా పవన్ కు మద్దతునిస్తున్నారు. ఈ సమయంలో పవన్ ఏది మాట్లాడినా ముద్రగడ వైపు తిప్పేస్తున్నారు.