Pawan Four Wifes : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాంలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యార్థులకు అమ్మ ఒడి పథకం నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్, చంద్రబాబులపై విరుచుకుపడ్డారు.
కురుపాంలో సభలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పరోక్షంగా పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా నేతలను చెప్పుతో కొడుతానంటున్నాడని, తోక కత్తిరిస్తానంటున్నాడని, తోడ కొడుతున్నాడని మండిపడ్డారు. నాలుగు పెండ్లిళ్లు చేసుకున్న వ్యక్తి లారీ ఎక్కి పిచ్చి కూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు దత్త పుత్రుడిలా వ్యవహరిస్తూ తనపై ఏది పడితే అది మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఇవన్నీ పేటెంట్ వాళ్లకే దక్కుతాయని ఎద్దేవా చేశారు. 2014 లో కూడా చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడని, నాటి హామీలను చంద్రబాబు తీర్చకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని జగన్ విమర్శించారు.
పవన్ కు కుటుంబ సంబంధాలను రోడ్డుపైకి తెచ్చాడని, మాట మీద నిలకడ లేని వ్యక్తి అని పేర్కొన్నారు. చెప్పుతో కొడుతా అంటాడు.. ఏదో చేస్తా అంటాడు.. ఆవేశంతో ఊగిపోతాడు.. అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా ఒక్కో సారి అర్ధం కాదు అంటూ ఎద్దేవా చేశారు. వాళ్లది.. దోచుకో పంచుకో విధానమని.. మాది అభివృద్ధి.. సంక్షేమ నినాదమని చెప్పుకొచ్చారు. ఆయనకు వచ్చినంత నీద రాజకీయాలు తనకు రావని చెప్పుకొచ్చారు. ప్యాకేజీ స్టార్ లా మాట్లాడడం తనకు చేత కాదని చెప్పుకొచ్చారు.
అయితే ఇదే సమయంలో జనసేన వీర మహిళలు రంగంలోకి దిగారు. పవన్ పై జగన్ వ్యాఖ్యలను ఖండించారు. వైఎస్ జగన్ తాత వైఎస్ రాజారెడ్డి ఎన్ని పెండ్లిళ్లు చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడం సరికాదంటూ నుండిపడ్డారు. అయితే జగన్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు కూడా మండిపడుతున్నాయి..