Pawan Decide : జనసేన పార్టీని ఎన్నికలకు చీఫ్ పవన్ కళ్యాణ్ సిద్ధం చేస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పటివరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమంటూ ఆయన గతంలో పదే పదే చెప్పారు. బీజేపీతో మిత్ర బంధం కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ ఇటు టీడీపీని కూడా కలుపుకునేందుకు చేతులు చాస్తున్నారు. జగన్ ను గద్దె దించడమే తమ ఉమ్మడి లక్ష్యమని చెబుతున్నారు. అయితే గద్దె నెక్కెదెవరో మాత్రం ఆయన చెప్పడం లేదు. అయితే ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నది. కేంద్రంలోని పెద్దలు ఓ వైపు వైసీపీకి ప్రాధాన్యమిస్తున్నారు. ఇలాంటి సమయంలో పొత్తు పెట్టుకుంటే జనసేనకు మేలు జరుగుతుందా.. నష్టం జరుగుతుందా అనేది తేల్చుకోవాలని పవన్ చూస్తున్నారు.
టీడీపీ కూడా బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్నది. జనసేనతో కలిసి ఈ కూటమి ఏర్పాటు చేసేందుకు అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో బీజేపీ అగ్రనేతలు మాత్రం వైసీపీతో సఖ్యతను కొనసాగిస్తున్నారు. బయటకు విమర్శలు చేస్తున్నా సీఎం జగన్ కు అనుకూలంగా వారు వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కు ఇబ్బంది గా మారింది. గతంలో ఒక రేంజ్ లో బీజేపీ తిట్ల దండకం ఎత్తిన చంద్రబాబు.. అధికారం లేకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీకి సహకరించాలని కోరుతున్నారు. అయితే దీనిపై బీజేపీ స్పందించలేదు. అటు జనసేన కూడా వైసీపీ తో బీజేపీ నేతల సఖ్యతను సీరియస్ గా తీసుకుంది. అయితే ఇప్పుడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షురాలిగా పురందేశ్వరీ నియామకం తర్వాత పార్టీలో ఏదైనా మార్పు వస్తుందా అనేది వారు వేచి చూస్తున్నారు. రాష్ర్టంలో అధికారంలో ఉన్న జగన్ ను ఢీకొట్టాలంటే కేంద్రం సహకారం అవసరం ఇదే నేపథ్యంలో బీజేపీ వైపు వారు చూస్తున్నా, ఆ పార్టీ సైలెంట్ గా జగన్ కు సహకరిస్తుండడం చంద్రబాబు, పవన్ లకు మింగుడు పడడం లేదు.
ఎన్నికల ముందు కేంద్రం చర్యలు ఇప్పుడు జనసేనానికి ఇబ్బందికరంగా మారింది. పొత్తుతో ముందుకు వెళ్లాలనుకుంటే బీజేపీ ఇలా వైసీపీ సహకరించడం ఆయనకు నచ్చడం లేదట. మరి రానున్న ఎన్నికల్లో పొత్తులు ఉంటాయా.. లేదంటే ఒంటరి పోరాటమా అనేది ఇక తేల్చుకోవాలని పవన్ చూస్తున్నారట. దీనిపై పలువురు నేతలతో సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం.
ReplyForward
|