Pawan Kalyan : పవన్ కల్యాణ్ అంటే ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం ఆయన ఇన్ స్టా గ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసిన రెండు గంటల్లోనే లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఆయన పదకొండు గంటల్లోనే మిలియన్ మంది అనుచరుల మార్కు దాటేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు ఉన్న స్టామినా ఏంటో అర్థమవుతుంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ప్రభంజనమే. అందుకే ఆయన రికార్డులు అలాగే ఉంటాయి. గతంలో ఫేస్ బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉన్నా ఇంతవరకు ఇన్ స్టా గ్రామ్ లో ఖాతా లేదు. ఇప్పుడు క్రియేట్ చేయడంతో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అరుదైన రికార్డు నెలకొల్పారు. పవన్ కల్యాణ్ ఇన్ స్టా గ్రామ్ లో అడుగుపెట్టిన అనతికాలంలోనే మిలియన్ మంది అభిమానులను దక్కించుకోవడం విశేషం.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఫాలోవర్స్ ను సంపాదించుకున్న సెలబ్రిటీలలో ఒకడిగా నిలిచాడు. టాప్ 10 సెలబ్రిటీలలో వీ ఆఫ్ బీటీఎస్ కి 43 నిమిషాల్లో, ఏంజిలీనా 59 నిమిషాల్లో , తమిళ హీరో విజయ్ 99 నిమిషాల్లో, ఎం టెయ్ ఇల్ గంట 45 నిమిషాల్లో ఉండగా టాప్ 9లో పవన్ కల్యాణ్ 6 గంటల 20 నిమిషాల్లో మిలియన్ ఫాలోవర్స్ ను సాధించుకోవడం గమనార్హం.
టాప్ హాలీవుడ్ సెలబ్రిటీల మధ్య మన పవన్ నిలవడం నిజంగా హర్షించదగినదే. ఇదంతా ఒక పోస్టు తోనే రావవడం యాదృచ్ఛికమే. ఆయనకు వచ్చిన ఫాలోవర్స్ పోస్టు చేయకుండానే వచ్చినవి. ఆయన పోస్టు చేస్తే వచ్చే ఫాలోవర్స్ ఇంకా ఎక్కువగా ఉండేవారు. అలా జరిగితే టాప్ 5 పొజిషన్ లో ఉండేవారు. దటీజ్ పవన్ కల్యాణ్. ఆయన ఏది చేసినా అందులో సంచలనం కచ్చితంగా ఉంటుంది.
ReplyForward
|