Pawan Kalyan & Vijay :
తెలుగులో అగ్ర నటుడు ఎవరంటే పవన్ కల్యాణ్ ను చూపిస్తారు. తమిళంలో విజయ్ ని ఎక్కువగా ఆరాధిస్తారు. వీరిద్దరు కూడా మంచి స్నేహితులు. వీరిద్దరు కలిసి ఓ సినిమా తీయాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఎస్ జె సూర్య దర్శకత్వంలో వీరిద్దరు కలిసి నటించేందుకు కథ కూడా సిద్ధమైంది. కానీ అప్పటికే సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్ తీసిన కొమరం పులి డిజాస్టర్ కావడంతో రిస్క్ చేయలేక సినిమా వాయిదా వేసుకున్నారు. అలా వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశమున్నా పట్టాలెక్కలేదు.
ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండటంతో వీరిద్దరు కలిసి సినిమా తీయాలని భావించుకున్నారు. దానికి ఎస్ జే సూర్యను ఎంచుకున్నారు. కథ కూడా సిద్ధమైంది. ఇక షూటింగ్ ప్రారంభించడమే తరువాయి. కానీ ఇంతలోనే పవన్ తో తీసిన సినిమా హిట్ కాకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. వీరి కలయికలో సినిమా వచ్చే అవకాశం ఆగిపోయింది.
ఇంకా రెండు సినిమాలు మాత్రమే తీసి తరువాత రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. ఇక వీరి కాంబినేషన్ లో సినిమా రావడం అనేది కలే. తెలుగు అగ్రనటుడు, తమిళ సూపర్ స్టార్ ఇద్దరు కలిసి నటించే చాన్స్ ఇక రాదని తెలుస్తోంది. విజయ్ ఇక శాశ్వతంగా నటనకు గుడ్ బై చెప్పనున్నారు. దీంతో వీరి కాంబినేషన్ కలగానే మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
చాలా వరకు సినిమాలు ఇలాగే ఆగిపోయాయి. అగ్ర నటులు అగ్ర దర్శకులతో ప్రారంభించిన సినిమాలు సైతం పట్టాలెక్కనివి ఉన్నాయి. ఇలా చిత్ర పరిశ్రమలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం మామూలే. మల్టీస్టారర్ సినిమాలు తెలుగులో తక్కువే. కానీ అందులో వీరిద్దరు కలిసి నటించే చాన్స్ కూడా దూరం కావడం వల్ల అభిమానుల కల అలాగే ఉండిపోయింది.