Pawan Kalyan As Cheif Guest :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలతో ప్రేక్షకులను వెంటవెంటనే పలకరించలేక పోయినప్పటికీ తన అభిమానులకు నిరాశ చెందకుండా ఉండేందుకు ఏదొక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తక్కువ సమయంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్ ప్లాన్ తో అటు రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయినప్పటికీ తన నిర్మాత కోసం ఒక పని చేయబోతున్నట్టు టాక్..
ఆ నిర్మాత ఎవరు? పవర్ స్టార్ చేయబోతున్న ఆ ఫేవర్ ఏంటంటే?.. పవన్ కళ్యాణ్ తన నిర్మాత ఏఎం రత్నం కోసం ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాబోతున్నట్టు టాక్.. కిరణ్ అబ్బవరం నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ”రూల్స్ రంజన్”.. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ కావడంతో ముందు నుండి యువత ఈ సినిమాపై కన్నేశారు.
ఈ సినిమా ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించగా ఆయన తనయుడు జ్యోతి కృష్ణ రత్నం డైరెక్ట్ చేసారు.. అక్టోబర్ 6న ఈ సినిమా రిలీజ్ కాబోతుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీంతో ఏఎం రత్నం కోసం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది.
పవన్ గెస్టుగా వస్తే సినిమాకు కావాల్సినంత హైప్ పెరుగుతుంది.. కాబట్టి తన వంతు తన నిర్మాతకు సాయం చేయనున్నాడు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ రాజకీయాలపై కామెంట్స్ చేస్తారా? లేదంటే సినిమాను రాజకీయాలను కలపడం ఇష్టం లేక కేవలం సినిమా ప్రమోషన్స్ మాత్రమే చేసి వెళ్ళిపోతారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా చర్చించు కుంటున్నారు. మరి ఏం జరగనుందో వేచి చూడాల్సిందే..
ReplyForward
|