
Ramgopal Varma Tweet : జనసేనాని పవన్ కళ్యాణ్ తో ఓవైపు వైసీపీ, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కలిసి ట్వీట్ ఫైట్ కు దిగారు. మొదట పవన్ కళ్యాణ్ ‘పాపం పసివాడు’ అంటూ జగన్ పై ఆరోపనలు గుప్పిస్తూ ట్వీట్ చేసి విమర్శించగా.. దానికి కౌంటర్ గా రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ తో పవన్ ను ఎండగట్టారు. ఇప్పుడు ‘ఎప్పుడో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.. పాపం పసివాడు అంటూ ప్యాకేజీ స్టార్ గా పవన్ ను పేర్కొంటూ వైసీపీ ట్వీట్ వార్ మొదలుపెట్టింది. దీనికి రచన, నిర్వహణ, దర్శకత్వం నారా చంద్రబాబు నాయుడు అంటూ డబ్బుల సంచులు, బ్యాగులతో పవన్ పోల్చి వైసీపీ ఘాటు ట్వీట్ చేసింది. ఇలా వైసీపీ వర్సెస్ జనసేన కార్టూన్ వార్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు కంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు పొడిచిన వెన్నుపోటు చాలా పెద్దదని విమర్శించారు.
రాంగోపాల్ వర్మ తన సినిమాలతోనే కాదు మాటలతోనూ, ట్వీట్లతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ప్రముఖులతో ఆడుకుంటాడు ఆయన. కారణం ఏదైనా పవన్ కళ్యాణ్ కు ఆయనకు మధ్య ఎప్పటి నుంచో వైరం కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా బండ్ల గణేశ్ చాలా సార్లు రాంగోపాల్ వర్మపై మండిపడ్డారు. అయితే బుధవారం ఏపీకి వచ్చిన పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటించారు. పంట నష్టపోయిన ఉభయ గోదావరి జిల్లాల రైతులను పరామర్శించారు. అనంతరం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. వైసీపీని ఓడించాలంటే ఓటు చీలకుండా చూసుకోవాలని, అందుకు పొత్తులు ఒక్కటే సరైన మార్గమని అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో జనసేన పొత్తు ఉండబోతోందని ఆయన చెప్పకనే చెప్పారు.
పవన్ కళ్యాణ్ అన్నమాటలపై రాంగోపాల్ వర్మ అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ నే కాకుండా, కాపు కులస్తులను, అంతెందుకు తనను తాను వెన్నుపోటు పొడుచుకున్నాడని ఆరోపించారు. ‘ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను పొడిచిన దానికంటే దారుణంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ జన సైనికులను, ఫ్యాన్స్ ను, వెన్నుపనోటుతో చంపేశాడని, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి’ అంటూ తన ట్విటర్ ఖాతా నుంచి ట్వీట్ చేశాడు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడ్డారు.
