
‘Bro’ Teaser Update :
అందరు ఎదురు చూస్తున్న సమయం ఆసన్నం అయ్యింది.. పవర్ స్టార్ సినిమా అంటే ఈ మాత్రం ఎదురు చూపులు తప్పవు కదా.. మరి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న బ్రో టీజర్ కు ఈ రోజు టైం అండ్ డేట్ ను మేకర్స్ లాక్ చేసి అఫిషియల్ గా పోస్టర్ ను రిలీజ్ చేసారు. మరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మూవీ టీజర్ ఎప్పుడు ఎలా రిలీజ్ చేయబోతున్నారంటే..
పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”బ్రో”.. పవన్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసుకుని న్న ఈ సినిమా అప్పుడే పూర్తి చేసుకుని రిలీజ్ కు కూడా రెడీ అవుతుంది. మరి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు..
ఇందులో పవన్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు.. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం అనే సినిమాను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టు కున్నాయి. ఇక తాజాగా టీజర్ కోసమా అంతా ఎదురు చూస్తుండగా ఈ రోజు ఈ సినిమా టీజర్ పై మేకర్స్ అఫిషియల్ అప్డేట్ ఇచ్చారు.
మొన్ననే సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి ఆకట్టుకోగా ఇప్పుడు పవర్ స్టార్ ఒక్కరే ఉన్న సింగిల్ లుక్ ను రిలీజ్ చేస్తూ ఈ టీజర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిముషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు.. ఈ పోస్టర్ లో పవన్ లుక్ తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను జులై 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.. కాగా పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.. తమన్ సంగీతం అందిస్తున్నారు.