
Pawan Kalyan Bro : ఈ వ్యాఖ్యలు విని అంతా షాక్ అవుతున్నారా? అవును ఈ వ్యాఖ్యలను స్వయంగా కేటీఆర్ చేయడం విశేషం.. ఈ వ్యాఖ్యలను విన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం ఆశ్చర్య పోతున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి..
కేటీఆర్ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో మాట్లాడారు.. ”నాకు పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్.. ఒక అన్న లాంటి వాడు.. చాలాసార్లు మేము కలుసుకుని ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం.. మా అభిరుచులు బాగా కలుస్తాయి.. అయితే రాజకీయాలు ఇందుకు అతీతం..
రాజకీయాలు, స్నేహానికి సంబంధం లేదు. ఎవరి రాజకీయాలు వారివి.. ఆయన రాజకీయాలు ఆయనవి.. నా రాజకీయాలు నావి.. ఏపీలో నారా లోకేష్ కూడా బాగా తెలుసు.. జగనన్న కూడా మంచి ఫ్రెండ్.. నాకు అందరు స్నేహితులే.. ఎవరితో ఎలాంటి ఇబ్బందులు లేవు.. అంటూ రాజకీయాలు రాజకీయాలే.. మా స్నేహాలు మావే అన్నట్టు కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఇక కేటీఆర్ మాట్లాడుతూ మా పార్టీ కూడా ఏపీలో పోటీ చేస్తుందని.. బీజేపీని వ్యతిరేకించే గొంతు బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని సీఎం కేసీఆర్ మాత్రమే ఏపీ ప్రయోజనాలను కాపాడగలరని ప్రజలు అనుకుంటే ఏమైనా అవుతుందంటూ.. బీజేపీని ఓడించే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రధాని మోడీని ముక్కుపిండి వసూలు చేసే సత్తా కేసీఆర్ కు ఉందని ఏపీ ప్రజలు భావిస్తే ఏదైనా జరగొచ్చు అని చెప్పుకొచ్చారు కేటీఆర్..