
జనసేన ఆవిర్బావ సభలో పవన్ కళ్యాణ్ ….
కసాబ్ లాంటి తీవ్ర వాదాలు దాడులు చూసి కలత చెందాను.దేశానికి బలమైన నేత కావాలని బలంగా కోరుకున్న. మోడి లాంటి బలమైన నేత దేశానికి అవసరం , 2014 లో మోడి పిలిస్తేనే వెళ్లి బేషరత్ గా మద్దతు ఇచ్చాను. మీ కోసం 2019 లో నేను బిజేపి ను వీడి బయటకు వచ్చాను. మీరు నాకు అండగా లేరు. బిజేపి వైసిపి కు సపోర్ట్ చేసింది. నేను ఒంటరి వాడినయ్యాను. మీ కోసం నేను బయటకు వస్తే మీరు నాకు అండగా ఉండలేదు బిజేపి పెద్దలతో మేం వేసిన ప్లాన్ కు వేరే పార్టీ లేకుండా పోయోది. అమరావతి కోసం మార్చ్ ఫాస్ట్ చెద్దామనీ డిల్లీ నేతలు ఒప్పుకున్నారు. ఏమైందో ఏమో …ఇక్కడ కు రాగానే వెనక్కు తగ్గారు.ఎన్ని సందర్భాలలో నేను బిజేపి కు అండగా ఉన్న. నేను అడిగితే అడిగితే డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రవేట్ పరం నిలిపివేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అక్కడ పని చేసే కార్మికులే ముందుకు రావడం లేదు. మిమ్మల్ని నమ్మి ఎన్ని సార్లు మోడి తో నేను గొడవ పడాలి. టిడిపి తో నేను పొత్తు గురించి చర్చ జరగలేదు, మీరు ఓట్లు వేయకపోయిన పర్వలేదు. నన్ను శంకించకండి. తెలంగాణా లో మద్దతు గా తిరగమన్న బిజేపి నేతలు నేను తెలంగాణ లో పోటీ చేస్తానంటే ఆంధ్రవాడివి అని బిజేపి నేతలు అన్నారు, వచ్చే ఎన్నికలలో జనసేన బలి పశువు కాదు, అసెంబ్లీ అడుగు పెడతాం.నాకు పాటు మన నాయకులు అంతా అసెంబ్లీ కు వస్తారు,