RamGopa Varma Tweet : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే స్టార్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు అస్సులు పడడం లేదు. సినిమాల నుంచి పర్సనల్ లైఫ్ వరకు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ను నిందిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఆయన తీసిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ ను విలన్ గా చూపించాడు. పవన్ రాజకీయ అరంగేట్రం నుంచి ఇటు సినిమాలు, అటు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ స్పందిస్తూనే ఉన్నాడు. తన రీసెంట్ మూవీ ‘వ్యూహం’లో కూడా పవన్ కళ్యాణ్ కు సంబందించిన ఫొటో రిలీజ్ చేసి మరించి ఆసక్తి రేకెత్తించాడు వర్మ.
వర్మ ఇటీవల తీసిన సినిమా ‘వ్యూహం’. దాదాపు కొన్ని రోజుల వ్యవధిలోని రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్ గురించి ఎటువంటి ప్రస్తావన కనిపించలేదు. వర్మ పవన్ కళ్యాణ్ ను మరిచిపోయాడు అని అందరూ అనుకున్నారు. కానీ, ఊహించని రీతిలో పవన్ కళ్యాన్, అల్లు అరవింద్, చిరంజీవి పాత్రలతో ఉన్న పిక్ ను ఇటీవల ట్విటర్ లో రిలీజ్ చేసి ఆశ్చర్యానికి గురి చేశారు.
నిన్న (జూలై 4వ తేదీ) ట్విటర్ వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారు వర్మ. ‘దీనికి సమాధానం ఏంటి?’ అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. పవన్ కళ్యాణ్ తను వదిలేసిన ఇద్దరి భార్యలకు తన ఆస్తులను అప్పగించినట్లు చెప్పిన వీడియో. దీనికి అనుసంధానంగా రేణు దేశాయ్ ని రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేసిన వీడియోను లింక్ చేసి రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి కోట్లాది రూపాయలు ఇచ్చానని చెప్తే. రేణు దేశాయ్ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పడం ఇందులో వినిపించింది.
వర్మ ఇది ఎందుకు రిలీజ్ చేయాలనుకున్నాడో కానీ ఇద్దరికి పడడం లేదని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. పవన్ పర్సనల్ జీవితం గురించి వర్మకు ఎందుకు? అని ఆయన ఫ్యాన్స్ రాంగోపాల్ వర్మను ఆడుకుంటున్నారు. ఇవేవీ పట్టించుకోని వర్మ ఆయన చేయాలనుకున్నది చేసుకుంటూ పోతాడు.