Pawan Kalyan : పవన్ కళ్యాణ్-ధరణి కాంబోలో 2006లో వచ్చిన చిత్రం ధరణి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన మీరా చోప్రా నటించింది. మంచి కథ, కథనంతో సాగే ఈ మూవీ అప్పట్లో మంచి హిట్ గా నిలిచింది. ఇందులో అశుతోష్ రాణా, ముఖేశ్ రిషి లాంటి భారీ తారాగణం ఉన్నారు. ఇక ఇందులో హీరోయిన్ సంధ్యకు చెల్లెలిగా నటించింది. ఎవరో తెలుసా..? ఆమె ప్రస్తుతం ఎంత అందంగా ఉందో చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
మీరా చోప్రా చెల్లెలి పాత్ర పేరు వింధ్యారెడ్డి అయితే ఆ పాత్రకు న్యాయం చేసింది మాత్రం సనూష సంతోష్. ఈ మూవీలో మీరా చోప్రా పవన్ కళ్యాణ్ కెమిస్ట్రీ కంటే పవన్ కళ్యాణ్ తో సనూష సంతోష్ సీన్స్ కే ఎక్కువ మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. అయితే, ‘బంగారం’తోనే సనూష సంతోష్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కంటే ముందు ఈ చిన్నది మలయాళంలో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గానే చేసింది. చిన్న వయస్సులోనే ఆమె బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు సార్లు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. బంగారం తర్వాత ఆమె 2012లో ‘మిస్టర్ మరుగన్’ చిత్రంతో హీరోయిగ్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రేణిగుంట, జీనియస్ వంటి చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.
నాని బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘జెర్సీ’లో కూడా ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మాలీవుడ్ (మలయాళం ఇండస్ట్రీ)లో వరుస సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా అమ్మడు యాక్టివ్ గానే ఉంటారు. అప్పుడప్పుడు ఆమె పిక్స్ అప్ లోడ్ చేస్తూ టాలీవుడ్ తో పాటు మాలీవుడ్ ను కూడా ఆకర్షిస్తుంటారు. ఇక కొవిడ్ సమయంలో చాలా వింతగా ప్రవర్తించానని, ఆ సమయంలో చాలా డిస్ట్రబ్ అయినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకచ్చింది సనూష సంతోష్. ప్రస్తుతం ఆమె ఒకటి, రెండు మలయాళం ప్రాజెక్టులతో బిజీగానే ఉంది.
