Pawan Kalyan – Anna Leznova : గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ – అతని భార్య అన్నా లెజ్నెవా మధ్య సంబంధం గురించి పుకార్లు వ్యాపించాయి. వారు విడాకులు తీసుకుంటున్నారని జోరుగా వార్తలు వచ్చాయి. పవన్ ను ఆయన మూడో భార్య వదిలేసి రష్యా వెళ్లిపోయిందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తల్లోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ ఇటీవల నిర్వహించిన యాగంలో ఆయన భార్య సమేతంగా చేయలేదు. అన్నా లెజినోవా కనిపించలేదు. ఇటీవల కుటుంబ కార్యక్రమాలలో అన్నా కనిపించకపోవడమే ఈ వార్తలు వ్యాపించడానికి కారణమైంది.
ఇప్పుడు ఈ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది. వైసీపీ మీడియా పవన్ మూడో భార్యతో కూడా విడాకులకు రెడీ అయ్యారని వార్తలు గుప్పించాయి. దీంతో పవన్ కళ్యాణ్ దానిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన చేస్తున్న రాజకీయ ర్యాలీలు, వైసీపీ వ్యక్తిగత విమర్శల మధ్య పవన్ కల్యాణ్‌కు ఈ విడాకుల వార్తలపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే తాజాగా ఆమెతో కలిసి పాల్గొన్న ఫొటోను బయటపెట్టారు.
జనసేన పార్టీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ వారాహి యాత్ర మొదటి దశ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పవన్-అన్నా లెజినోవా పాల్గొన్నారని పేర్కొంటూ ఫొటోను రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్‌ను అనుసరిస్తూ నడుస్తున్న ఆయన భార్య అన్నా లెజ్నెవా ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్‌లో ‘శ్రీమతి అన్న కొణిదెల’ అంటూ పవన్ తోపాటు ఆయన భార్య పాల్గొన్నారని చూపించారు. దీంతో పవన్ కళ్యాణ్‌పై విడాకుల పుకార్లకు తెరపడినట్లే కనిపిస్తోంది.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు – వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా… pic.twitter.com/x3WJ5iUtQv
— JanaSena Party (@JanaSenaParty) July 5, 2023