Pawan Kalyan – Instagram : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఫాలో యింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకున్న విలువ అలాంటిది మరి. ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న పవన్ కల్యాణ్ ఏది చేసిన సంచలనమే. ఇన్నాళ్లు ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా మాత్రమే చురుకుగా ఉన్న పవన్ తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసిన గంట వ్యవధిలోనే రెండు లక్షల అనుచరులు కావడం సంచలనం కలిగించింది.
ఇంత త్వరగా అంత మంది ఫాలోవర్స్ సంపాదించుకున్న వారిలో పవన్ ముందు వరసలో నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో దక్షిణ ఇండియాలోనే ఇంత మందిని తన ఫాలోవర్స్ గా చేసుకున్న పవన్ నిలవడం గమనార్హం. రెండు గంటల వ్యవధిలో 5 లక్షల మంది ఫాలోవర్స్ అయ్యారు. ఇలా పవన్ కల్యాణ్ కు ఇంత మంది అనుచరులను సంపాదించుకోవడంపై ఆశ్చర్యం కలిగించింది.
సౌత్ ఇండియాలోనే ఆల్ టైం టాప్ 2 ఫాస్టెస్ట్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్న అకౌంట్ గా నిలిచారు. మొదటి స్థానంలో తమిళ స్టార్ ఇలయదళపతి విజయ్ అకౌంట్ ఉంది. కానీ అతడి ఖాతాకు వచ్చిన ఫాలోవర్స్ నిజాయితీగా వచ్చినవి కావని తెలుస్తోంది. కానీ పవన్ కల్యాణ్ కు వచ్చిన అనుచరులు జెన్యూన్ గా వచ్చిన వారే. దీంతో పవన్ కల్యాణే గ్రేట్ అంటున్నారు.
ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లకు కూడా తమ ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి రోజుల వ్యవధి పట్టింది. కానీ పవన్ కు మాత్రం అంత సమయం పట్టాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. కొన్ని గంటల్లోనే ఆ మార్కును దాటుతారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ స్టా గ్రామ్ లో పవన్ కల్యాణ్ తన అనుచరులను పెంచుకోవడం పెద్ద పనేమీ కాదని తెలుస్తోంది.