
Pawan Kalyan mania : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మేనియా ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కాషాయ పార్టీ తరఫున ఆయన హస్తినలోనూ ప్రచారం చేయబోతున్నారని తెలుస్తోంది. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం బీజేపీకి అనుకూలంగా మారినట్లుగానే, ఢిల్లీలోనూ ఇదే ఫలితం వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఇప్పటివరకు గెలుపును నమోదు చేయలేకపోయింది. అయితే, ఈసారి ఢిల్లీలో విజయం సాధించేందుకు పార్టీ కొత్త వ్యూహాన్ని అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించనున్నారు.
ఇటీవల అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ విజయకేతనం ఎగరిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోనూ ఆయన ప్రచారం బీజేపీకి ఎంతవరకు కలిసివస్తుందో చూడాలి.