Pawan Kalyan :
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే అందరికి ఎంతో ఇష్టం. ఆయన నటిస్తున్న సినిమా బ్రో ది అవతార్ వచ్చే నెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన టీజర్ మరో రెండు రోజుల్లో విడుదల తేదీని ప్రకటిస్తారు. దీంతో ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపవుతున్నాయి. ఇప్పటికే దీనిపై అభిమానులు సినిమాపై ఎన్నో ఊహలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కు ఇది మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఎంట్రీపై కూడా రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇందులో కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడని అంటున్నారు. దీనికి సంబంధించిన పలు విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా నిలుస్తున్నాయి. సినిమాలో కామెడీ టైమింగ్ ఓ ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. కానీ అదంతా ఫేక్ అని అంటున్నారు. సినిమాలో పవన్ పాత్ర పూర్తి నిడివిగా ఉంటుందంటున్నారు.
సినిమాలో పవన్ కల్యాణ్ 17 నిమిషాల తరువాత కనిపిస్తాడట. పవన్ ఇంట్రడక్షన్ మాత్రం వెరైటీగా ఉంటుందట. అందుకే ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది. సినిమా ఎప్పుడొస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. బ్రో ది అవతార్ సినిమా మరో వండర్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాపై అందరిలో కూడా పలు విధాలా ఆలోచనలు పెరుగుతున్నాయి.
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. శివుడి రూపంలో పవన్ కనిపిస్తాడని అంటున్నారు. క్లైమాక్స్ లో తన విశ్వరూపం చూపిస్తాడు. పవన్ శివుడి గెటప్ లో ఎలా ఉంటాడోననే ఆతృత అందరిలో ఉంది. దీంతో పవన్ కల్యాణ్ ను శివుడి వేషంలో చూడాలని కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి మరి.