
Pawan Kalyan producer : పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కూడా బిజీగా మారారు. ఆయన డేట్స్ అసలు ఖాళీగా లేవు. అయితే సినిమా లేదంటే రాజకీయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. దీని కోసమే రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. వారాహి వాహనంతో రేపటి నుంచి పర్యటించేందుకు పక్కా ప్లాన్ చేసుకున్నారు.
ఆయనతో అత్తారింటికి దారేది సినిమా తీసిన బీవీఎస్ఎన్ ప్రసాద్ ను జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో పార్టీని నలుదిశలా వ్యాపించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే రాజకీయ మార్పు కోసం తపిస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఆశిస్తున్నారు. దీని కోసమే తన శాయిశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన పార్టీకి అధికారం తీసుకురావాలని ఎన్నో ఆశలు పెంచుకున్నారు.
సినిమాల పరంగా కూడా ఆయన దూకుడు పెంచారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సుజీత్ డైరెక్షన్ లో ఓజీ, ఇంకా బ్రో అనే సినిమాను కూడా నిర్మిస్తున్నారు. ఇలా నాలుగు సినిమాలు ఏకకాలంలో సెట్ పై ఉండటం ఇదే ప్రథమం. ఇలా పవన్ కల్యాణ్ ఒంటి చేత్తో రెండు రంగాలను ప్రభావితం చేస్తున్నారు.
బీవీఎస్ఎన్ ప్రసాద్ అత్తారింటికి దారేదీ సమయంలో తనకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదని కేసు పెట్టిన పవన్ కు ఇప్పుడు ఆయన ఆప్తుడయ్యాడు. రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని వీరు నిరూపించారు. ఏది ఏమైనా పవన్ కల్యాణ్ భవిష్యత్ లో రెండు రంగాలను ఎలా సమన్వయం చేస్తారోననే ఆలోచన అందరిలో వస్తోంది.






