Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టామీనా అందరికి తెలిసిందే. ఆయన సినిమాలు చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడతారు. పవన్ రాజకీయాల్లోకివచ్చిన తరువాత కూడా ఆయన క్రేజీ తగ్గడం లేదు. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ సామాజిక అంశాల మీదే దృష్టి పెడుతుంటారు. సినిమాల గురించి పెద్దగా పట్టించుకోకున్నా అభిమానులు మాత్రం పవన్ కోసం ఎంతో ప్రేమ కురిపిస్తుంటారు. సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడరు. చేసుకుంటూ పోవడమే ఆయనకు తెలిసింది.
ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఖాతాలున్న పవన్ తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో తన అకౌంట్ ను క్రియేట్ చేసుకున్నారు. దీంతో లక్షల మంది ఆయన ఫాలోవర్స్ గా మారిపోయారు. కొన్ని గంటల్లోనే ఈ ఘనత సాధించడంతో పవన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతలా ఉంటుందో అర్థమవుతోంది. ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ లోకి అడుగు పెట్టడంతో ఎంతో మంది అభిమానులు ఆయన అనుచరులుగా చేరడం విశేషం.
పవన్ కల్యాణ్ ఇన్ స్టా గ్రామ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ఫాలోవర్స్ ఆయన అనుచరులుగా చేరిపోయారు. ఒక్క పోస్టు కూడా పెట్టకుండానే పవన్ కల్యాణ్ అత్యధిక వేగంగా మిలియన్ ఫాలోవర్స్ పెరగడం సంచలనంగా మారింది. పవన్ రెండు మిలియన్ల అనుచరులుగా పెరగడం విశేషం. ఒక పోస్టు కూడా పెట్టకుండానే పవన్ కల్యాణ్ ఈ ఘనత సాధించడంతో రికార్డులు బ్రేక్ చేశాడు.
ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక తెలుగు వాడిగా పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించాడు. మొదటి పోస్టు ఎలా ఉంటుందో చూడాలి అని చూస్తున్నారు. కొత్త ట్రెండ్ సృష్టించాలని చూస్తున్నారు. ఈనెల 28న విడుదల అవుతున్న బ్రో సినిమాతో వండర్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బ్రో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి మరి.
ReplyForward
|