
Pawan Kalyan spoke the absolute truth: ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చాడు. సాధారణంగా మంది ఎక్కువైతే మజ్జిక పలుచన అన్నట్లు ఎక్కువ పార్టీలు పోటీ చేస్తే గంపగుత్త ఓట్లతో పాలకపక్షం మరోసారి అధికారం దక్కించుకుంటుంది. అయితే ఈ సారి ఆ అవకాశం ఇచ్చేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఓట్లు చీలడం వల్ల వైసీపీకే లాభం చేకూరుతుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని, వ్యతిరేఖ ఓట్లను తామ ఖాతాలోనే వేసుకోవాలని అనుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.
అయితే జనసేన పార్టీ కార్యకర్తలకు ఇంకో విషయం కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. సీఎం అభ్యర్థి గురించి ఆలోచించవద్దన్నారు. ప్రస్తుతం లక్ష్యం వైసీపీని గద్దె దించడమేనని, ఆ తర్వాత సీఎం ఎవరనేది ఆలోచిస్తామని చెప్పారు. సీఎం పదవి కోసం రాజకీయం చేయడ కరెక్ట్ కాదన్నారు. ఒక వేళ జనసేన పొత్తుకు వెళ్లినా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో మేజర్ రోల్ పోషించేది టీడీపీ మాత్రమే, ఇక మైనర్ గా జనసేన నిలిస్తే ఆ పార్టీ అభ్యర్థిని సీఎం చేసే ఛాన్స్ లేనట్లుగా తెలుస్తోంది.
జనసేన పొత్తుకు వెళ్తానని చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశలో పొత్తుకు వెళ్లాలంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశంతోనే సాధ్యమవుతుంది. అక్కడ బీజేపీకి అంత ఆదరణ లేదు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే దానికి బీజేపీకి కలిసి వస్తుందా అని చూడాలి. బీజేపీకి సెంట్రల్ లో మంచి పార్టనర్ గా నిలుస్తున్నారు వైసీపీ సీఎం జగన్. దాదాపు చాలా అంశాల్లో కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు ఆయన. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు ఓటేశారు. కానీ ఇక్కడ టీడీపీ కూడా సెంట్రల్ లో బీజేపీకి సపోర్ట్ చేస్తూ వస్తుంది. పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటామన్న వ్యాఖ్యలతో బీజేపీ కలిసి వస్తుందా అని ఏపీలో చర్చ జరుగుతోంది.