Pawan Kalyan :
జనసేన అధినేతపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫోకస్ పెడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి గాజువాక నుంచి పోటా చేస్తారా..? లేక భీమవరం నుంచా..? న్న చర్చలు పార్టీలో జోరుగా మొదలయ్యాయి. ఆయన 2019 ఎన్నికల్లో కూడా గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే గతంలో కాకుండా ఈ సారి అదే సీటుపై పోటీ చేస్తే తప్పకుండా గెలిపించుకుంటామని జన సైనికులు అధినేతకు హామీలు ఇస్తున్నారు.
ఎవరెన్ని చెప్పినా ఈ సారి పవన్ గాజువాకపై ఆసక్తి చూడం లేనట్లు తెలుస్తోంది. ఆయన 2019 నుంచి నాలుగేళ్లలో రెండు పర్యాయాలు మాత్రమే గాజువాకకు వెళ్లారు. దీంతో అక్కడ ఆయనకు పట్టు ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పవన్ ఈ సారి భీమవరం నుంచి పోటీ చేస్తారు కావచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గోదావరి జిల్లాలపై జనసేన ఎక్కువ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా భీమవరం నుంచి పోటీ చేస్తే లాభించవచ్చన్న వాదనలు ఉన్నాయి.
అయితే, పొత్తులు ఉంటాయని స్పష్టం చేసిన జగన్ గాజువాక సీటును పొత్తులో జనసేనకు అప్పగించాలని కోరుకుంటోంది. ఈ సీటు బీసీలకు ఇస్తే కమ్మ, బీసీ కార్డుతో బయటపడవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యలో ఇక్కడ ఎవరిని పోటీ పెడతారోనని సందగ్ధత నెలకొంది. గతంలో జనసేన అధినేత నిల్చున్న సీటు కావడంతో ఎంతో కొంత పార్టీకి లాభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
గాజువాక సీటు విషయానికి వస్తే పవన్ కాకున్నా జనసేనకే సీటు కోరుతారు అంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో టెన్షన్ పెరిగింది. గాజువాక నుంచి సీనియర్ నేత ఒకరు పోటీకి సిద్ధంగా ఉన్నారు. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్తే.. సదరు సీనియర్ నేత పార్టీ మారే అకాశం ఉందన్న వాదనలు ఉన్నాయి. ఇదే జరిగితే కోరి కోరి ఒక సీటును కోల్పోవాల్సి వస్తుందని ఇటు తెలుగుదేశం భావిస్తోంది. ఏది ఏమైనా ఈ సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారని జన సైనికుల నుంచి లీకులు వినిపిస్తున్నాయి.