Pawan Kalyan ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే నామ స్మరణ.. బ్రో అనే పేరునే అందరి నోటా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.
మరి ఈ సినిమా ఈ వీకెండ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీంతో నిన్న రాత్రి బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లోకి పవర్ స్టార్ కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.. ఈ వేదికపై ఈయన మాట్లాడుతూ.. బ్రో సినిమా ఎక్కువ రోజులు చేయాల్సిన సినిమా.. నేను పొలిటికల్ రంగంలోకి వెళ్లిన తర్వాత నా మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది.
సినిమాలంటే నాకు ఇష్టం.. సమాజం నా బాధ్యత.. ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఏ ఒక్కరి సొంతం కాదు.. మీరు బలంగా అనుకుంటే రాణించగలరు. చిరంజీవి మాత్రమే నా దృష్టిలో హీరో.. నేను ఉద్యోగం చేసి వ్యవసాయం చేయాలని అనుకున్న.. మా వదిన గారు సినిమా రంగంలోకి తీసుకొచ్చారు. మనల్ని నమ్మే వారు ఉండాలి..
పదిమందిలో నటించడం అంటే నాకు సిగ్గు.. అందుకే సుస్వాగతం షూట్ సమయంలో నేను ఏడ్చి మా వదినకు ఫోన్ చేశాను.. నన్ను ఎందుకు ఈ రంగంలోకి తీసుకు వచ్చావు.. నువ్వు చెప్పకపోతే నా పాటికి నేను ఉద్యోగం చేస్తూ చిన్న జీవితాన్ని గడిపేవాడిని.. మా వదిన చేసిన ద్రోహానికి నేను మీ ముందు ఉన్నాను. నేను త్రికరశుద్ధిగా పని చేయడం వల్లనే మీ ముందు ఉన్నాను.. మధ్య తరగతి నుండి వచ్చిన మేమే చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు.. మీరు ఏది అనుకుంటే అది చేయగలరు అని పవన్ చెప్పిన వర్డ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..