Pawan Kalyan : తిరుపతిలో జనసేన నాయకులను కొట్టిన సీఐ అంజూ యాదవ్ పై చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి పయనమయ్యారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు.
రేపు జరగబోయే ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో పవన్ పాల్గొనన్నారు. పవన్ తోపాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఢిల్లీ వెళ్లారు.
ఎన్టీఏ భాగస్వామ్య పక్షాలు 30 పార్టీలతో బీజేపీ నేతృత్వంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం జనసేనకు మాత్రమే ఆహ్వానం అందింది. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ సహా ఏ పార్టీని బీజేపీ పిలవలేదు. దీంతో పవన్ కళ్యాణ్ తోనే బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పోటీచేయడం ఖాయంగా మారింది. పవన్ ఢిల్లీ టూర్ వెనుక పొత్తుల రాజకీయం ఉందని తెలుస్తోంది. టీడీపీని కాదని కేవలం జనసేనతోనే బీజేపీ వెళుతుందని అర్థమవుతోంది.