Pawan Kalyan wife : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తమ కుమారుడి క్షేమంగా తిరిగి రావడంతో అతడి కోసం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. పద్మావతి కళ్యాణకట్టలో ఆమె సామాన్య భక్తులతో కలిసి ఈ మొక్కును తీర్చుకున్నారు.
శ్రీమతి అన్నా కొణిదెల గారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం ఆమె తలనీలాలు సమర్పించారు.
కొద్దిరోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాద సమయంలో మార్క్ శంకర్ క్షేమంగా బయటపడ్డాడ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకున్న వెంటనే స్వామి తమ బిడ్డను కాపాడి పునర్జన్మ ప్రసాదించారని శ్రీమతి అన్నా కొణిదెల గారు గట్టిగా నమ్ముతారు. భారతీయ సనాతన ధర్మ గొప్పదనానికి గౌరవం ఇస్తూ, స్వామి మీద తనకున్న అచంచలమైన నమ్మకానికి గుర్తుగా ఆమె సామాన్య భక్తులతో పాటు పద్మావతి కళ్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించారు.
తమ కుమారుడి ఆరోగ్యం బాగుంటే శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధికి వచ్చి తలనీలాలు ఇస్తామని ఆమె మొక్కుకున్నారు. ఆ మొక్కులో భాగంగానే శ్రీమతి అన్నా కొణిదెల గారు తాజాగా తిరుమలకు వెళ్లి తలనీలాలు సమర్పించుకొని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఆమె తన విశ్వాసాన్ని, భక్తిని చాటుకుంటూ సామాన్య భక్తులతో కలిసి తలనీలాలు సమర్పించడం అందరినీ ఆకట్టుకుంది.
శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న శ్రీమతి అన్నా కొణిదెల గారు
• పద్మావతి కళ్యాణకట్టలో సామాన్య భక్తులతో కలిసి తలనీలాల సమర్పణ
• టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పత్రాలపై సంతకం
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని తలచుకున్న వెంటనే… pic.twitter.com/zG97x7WuEj
— JanaSena Party (@JanaSenaParty) April 13, 2025