
Pawan Kalyan will become CM if he claps and not if he votes : ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అధికారం కోసం తాపత్రయపడుతోంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఓటు విలువ గురించి తనదైన శైలిలో వివరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఏంటో గుర్తించని నాడు దాని ప్రాధాన్యం తగ్గుతోంది. మోసం చేసే వాడినే ఎన్నుకుంటారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే వారికి ప్రాధాన్యం ఇస్తున్నాం.
మన మీద ఉన్న అభిమానాన్ని మన బలంగా మలుచుకోవాలి. నియోజకవర్గాల్లో ధైర్యంగా తిరగాలి. అప్పుడే మనకు ఓటు బ్యాంక్ ఉంటుంది. హైదరాబాద్ లో ఎంఐఎం 8 సీట్లు పక్కాగా గెలుచుకుంటుంది. దాని ఉద్దేశాలు, లక్ష్యాలు వేరే అయినా అది అక్కడ తిరుగులేని అధికారం తెచ్చుకుంటుంది. కానీ మనం ఒక సీటు కూడా తెచ్చుకోలేదు. నిజాయితీగా ఉంటే ఫలితం ఇలాగే ఉంటుంది.
మనం కూడా మనకు కొన్ని సీట్లు గెలుచుకునే సత్తా రావాలి. ఓటమి సాధించిన వాడికే గెలిచే సత్తా ఉంటుంది. కచ్చితంగా గెలిచి తీరుతాం. రాష్ట్రంలో మన పాలన రావడం గ్యారంటీయే. చప్పట్లు (claps) కొడితే సీఎం కాలేరు. ఓట్లువేస్తే సీఎం అవుతారు. దీనికి అందరు జనసేన పార్టీని కచ్చితంగా అధికారంలో నిలిపి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అలయెన్స్ లేకపోతే అధికారం సాధ్యం కాదు. అందుకే ప్రతి ఎన్నికల్లో పొత్తు తప్పనిసరి. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తులు ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఎవరికి మద్దతు ఇస్తారో తెలియడం లేదు. చివరి వరకు ఎటు వైపు మొగ్గుతారో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఎవరి వ్యూహం ఎటు వైపు తిరుగుతుందో తేలడం లేదు.