Tholi Prema:
పవన్ కల్యాణ్ సినిమా అంటే క్రేజీ ఉంటుంది. పవన్ కల్యాణ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా తొలిప్రేమ. ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మళ్లీ రీ రిలీజ్ చేశారు. దీంతో సినిమాకు ఆదరణ లభిస్తోంది. పవన్ మేనియా అంటే ఇదే. ఆయన పేరు వినిపిస్తే చాలు ఉర్రూతలూగుతారు. అలాంటి శక్తి ఉన్న హీరో పవన్ కల్యాణ్ కావడం గమనార్హం.
అప్పట్లో ఈ సినిమా కలెక్షన్లు అదరగొట్టాయి. తొలిరోజు రూ. 4.20 కోట్లు వసూలు చేసింది. రూ.7.70 కోట్లు కలెక్ట్ చేసిందని చెబుతుంటారు. ఆ రోజుల్లో అలాంటి హంగామా చేసిన సినిమా ఇప్పుడు మళ్లీ అదే రేంజ్ లో అభిమానులను కనువిందు చేయడానికి వచ్చేస్తోంది. పవన్ కల్యాణ్ శక్తి ఏమిటో చూపించనుంది. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో మళ్లీ ఏం వండర్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తొలిప్రేమ రీ రిలీజ్ ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తుందని అంచనా. భారీ ఎత్తున ప్రమోట్ చేసేందుకు ప్లాన్ చేస్తన్నారు. నిన్న అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. దీనికి అదరగొట్టే రెస్పాన్స్ వచ్చింది. మూడు షోలు హౌస్ ఫుల్ అయ్యాయంటే పవన్ కల్యాణ్ కు ఉన్న అభిమానం ఏంటో తెలుస్తుంది. బాక్సాఫీసు కలెక్షన్లు కొల్లగొట్టి మరోమారు పవన్ పరిశ్రమను షేక్ చేయనున్నాడు.
పవన్ కెరీర్ లో ఖుషి కూడా రికార్డులు తిరగరాసింది. అదే కోవలో తొలిప్రేమ కూడా మరోమారు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సెన్సేషనల్ దర్శకుడు కరుణాకరన్ తొలిప్రేమను హృద్యంగా చిత్రీకరించారు. ప్రేమ కథను అందంగా తీసి అందరిలో అభిమానం సంపాదించుకున్నాడు. అలా పవన్ కల్యాణ్ కు స్టార్ డమ్ తీసుకొచ్చాడు.