Bro Teaser Breaks The Records :
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో ది అవతార్ ఈ నెల 28న విడుదల చేయనున్నారు. దీంతో దీనిపై అప్పుడే జోష్ మొదలైంది. మామా అల్లుళ్లు ఏం సందడి చేయబోతున్నారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పటికే సినిమాపై ఎన్నో అంచనాలు పెరుగుతున్నాయి. తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ్యా సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా సినిమా మార్చుకున్నారు. సముద్రఖని దర్శకత్వంలో వస్తుండగా త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్ పంచులకు ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయమే. దీనికి సంబంధించిన టీజర్ ను ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో బ్రో సినిమా ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాల్సిందే.
ఈ సినిమాకు 24 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్ నాలుగు లక్షల 90 వేల లైకులు వచ్చాయి. వ్యూస్ విషయంలో ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇలా వ్యూస్ పెరగడంతో ఆదిపురుష్ కు కూడా రాని వ్యూస్ దీనికి రావడం గమనార్హం. ఇలా బ్రో సినిమా టీజర్ కు అంత విలువ రావడంతో మహేశ్ బాబు గుంటూరు కారంకు రాని రెస్పాన్స్ బ్రో కు రావడం గమనార్హం.
గుంటూరు కారంకు ఇప్పటివరకు 32 మిలియన్ వ్యూస్ నాలుగు లక్షల 25 వేల లైక్స్ వచ్చాయి. ట్రీ టీజర్ కు 40 గంటల్లోనే 32 మిలియన్ వ్యూస్ 5 లక్షల 15 లైకులు రావడం జరిగింది. ఈనేపథ్యంలో బ్రో సినిమా ఎంతటి వండర్ క్రియేట్ చేస్తుందో తెలియడం లేదు. పవన్ కల్యాణ్ నటించడంతో బ్రో సినిమా మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవడం జరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.