
Pawan and Lokesh :
టీడీపీ యువనేత లోకేశ్ బాబు యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 1600 కిలో మీటర్ల మైలురాయికి ఆయన యాత్ర చేరుకుంది. మొన్నటి వరకు రాయలసీమ జిల్లాల్లో కొనసాగిన ఆయన యాత్ర ప్రస్తుతం కోస్తాంధ్ర జిల్లాల్లో కొనసాగుతున్నది. ప్రస్తుతం నెల్లూర్ జిల్లాల్లో కొనసాగుతున్నది. లోకేశ్ యాత్రకు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయా చోట్ల తనదైన శైలిలో వైసీపీ శ్రేణులకు సవాల్ విసురుతూ లోకేశ్ బాబు ముందుకెళ్తున్నారు.
అయితే ఇన్నాళ్లూ సినిమాలకే పరిమితమైన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వారాహియాత్ర మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆయన యాత్ర గోదావరి జిల్లాలో కొనసాగుతున్నది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో పవన్కు ఘన స్వాగతం లభిస్తున్నది. ఆయా జిల్లాల్లో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికెళ్లినా పవన్ తో కలిసి అభిమానులు ముందుకు సాగుతున్నారు.
అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా , ఇప్పడు కొన్ని రోజుల్లో లోకేశ్ యాత్ర గోదావరి జిల్లాల్లో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు పవన్ కు ఆ జిల్లాలో వస్తున్న ఆదరణ మరి లోకేశ్ వస్తుందా అని టీడీపీ శ్రేణుల్లో ఉంది. లేకుంటే పవన్ చరిష్మా ముందు ఫ్యూచర్ స్టార్ ఇన్ టీడీపీ గా ప్రచారం చేసుకుంటున్న లోకేశ్ బాబు ఇమేజ్ తక్కువైపోతుంది. ఇలాంటి సమయంలో ప్రజలను లోకేశ్ ఆ స్థాయిలో ఆకర్షిస్తాడా అనేదే పెద్ద సందేహం. అయినా జనం సభలకు రావడం మాత్రమే కాదు.. ఓట్లు తమవైపు తిప్పుకున్నప్పుడే ఏదైనా ఫలితం ఉంటుంది. లేకుంటే ఎన్ని చేసినా విఫలమే అవుతుంది. ఏదేమైనా వపన్ సభలకు జనం వచ్చి, లోకేశ్ కు రాకుంటే పార్టీ క్యాడర్ లో నిరాశ మిగులుతుంది. అలా అని ఎలాగోలా జనాన్ని తరలిస్తే రేపటి రోజు ఎన్నికల్లో ఆ పోల్ మేనేజ్మెంట్ జరగక పోయినా ఇబ్బందిక ర పరిస్థితులు ఎదురవుతాయి. సో.. గోదావరి జిల్లాల్లో తమ వర్గం ఓట్ల కోసం పవన్, తమ పార్టీ ఓట్లు కాపాడుకునేందుకు లోకేశ్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈసారి వైసీపీని కోలుకోకుండా దెబ్బకొట్టడమే వీరిద్దరి వ్యూహం.



