Pawan Missing : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి విజయ యాత్రలో భాగంగా నరసాపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆయన అభిమానులు, జనసైనికులు భారీ సంఖ్యలో బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అధికార పార్టీ వైసీపీపై విమర్శలు సంధించారు.
పులివెందుల నుంచి వచ్చిన కొందరు నర్సాపురాన్ని ఆక్రమించుంటున్నారని, వారి ఆగడాల కారణంగా జిల్లాలో ప్రశాంతత కరువైందని మండిపడ్డారు. ఇక్కడి వ్యాపారాల్లో జోక్యం చేసుకొని దోపిడీ చేస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయాలనే తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. మరో 25 ఏళ్లపాటు పనిచేసే శక్తి తనలో ఉందన్నారు.
జగన్ కాపులకు న్యాయం చేయడనే విషయం స్పష్టమైందని, ఈ ఎన్నికల్లో రాబోతున్నదని తాను నమ్ముతున్నానని చెప్పారు. వైసీపీ గుండాయిజం, బెదిరింపులకు పారిశ్రామిక వేత్తలు ఏపీకి రావడానికి భయపడుతున్నారని ఆరోపించారు.
నర్సాపురం జ్ఞాపకాన్ని నెమరువేసుకున్న పవన్..
పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పశ్చిమగోదావరిలోని నరసాపురంతో ముడిపడి ఉన్న తన చిన్ననాటి జ్ఞాపకాన్ని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నరసాపురం బస్టాండ్ లో తప్పిపోయాయని చెప్పాడు. తాము పాలకొల్లులో ఉన్నప్పుడ తనకు ఐదారేళ్ల వయస్సు ఉందని, అప్పుడు తన తండ్రితో కలిసి పాలకొల్లు వచ్చానని తెలిపారు.
నరసాపురం స్టేషన్‌లో బస్సు కోసమో జట్కా బండి కోసమో ఎదురు చేస్తున్నామని చెప్పారు. అయితే తండ్రి తనను ఓషాప్ ఓనరు దగ్గర ఉంచి, కొద్ది సేపు చూస్కోమని చెప్పి బయటకు వెళ్లాడని చెప్పారు. అయితే ఆ వయసులో పరిస్థితిని అపార్థం చేసుకొని తన తండ్రి తనను విడిచిపెట్టాడని పొరపాటు పడ్డానని చెప్పాడు.
అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పాడు. ఆ షాప్ ఓనరు, స్థానికులు నా కోసం వెతికారని, చివరికి వారు నన్ను మా నాన్నకు అప్పగించారని చెప్పాడు. అదృష్టం బాగుండి దొరికానని, లేదంటే ఎక్కడో తిరుగుతూ ఉండేవాడినని నవ్వతూ చెప్పాడు పవన్ కల్యాణ్.